
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపును చేపడతారు. 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్‌ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది. కాగా, 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూల వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.