Cabinet approved
-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ: పండగ సీజన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఉద్యోగులకు డీఏ(డియర్నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్(డియర్నెస్ రిలీఫ్)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్(డియర్నెస్ రిలీఫ్)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్-నవంబర్ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది.ఇదీ చదవండి: బంగారం స్వచ్ఛత తెలుసుకోండిలా..ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపుఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు. -
కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..
రైతుల ఆదాయం, ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్రం రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశానికి స్వావలంబన చేకూర్చేందుకు ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్(ఎన్ఎంఈఓ)’ ఏర్పాటు కోసం రూ.10,103 కోట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘అన్నదాతల ఆదాయం పెంచేందుకు, దేశంలో ఆహార భద్రతను వృద్ధి చేసేందుకు పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్కేవీవై), కృషోన్నతి యోజన పథకాలను ప్రారంభిస్తున్నాం. అందుకోసం రూ.1,01,321 కోట్లు కేటాయిస్తున్నాం. పీఎం-ఆర్‌కేవీవైలో భాగంగా నేల సారం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ.. వంటి వివిధ చర్యల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించాలని నిర్ణయించాం. దేశంలో వంట నూనె అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్(ఎన్ఎంఈఓ)ను ఏర్పాటు చేస్తున్నాం. అందుకు రూ.10,103 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ మిషన్ ద్వారా రానున్న ఏడేళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాం. 2022-23 సంవత్సరానికిగాను నూనె గింజల ఉత్పత్తి 39 మిలియన్ టన్నులుగా ఉంది. దీన్ని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఈ మిషన్‌లో భాగంగా నూనెగింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లకు విస్తరించనున్నాం. ఆవాలు, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి కీలక నూనెగింజ పంటల ఉత్పత్తిని మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కాటన్ సీడ్, రైస్ బ్రాన్..నుంచి నూనె తీసే ప్రక్రియను వేగవంతం చేయబోతున్నాం. రూ.63,246 కోట్ల వ్యయంతో చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దశలో 118.9 కిలోమీటర్లమేర మూడు కారిడార్లు, 128 స్టేషన్లు ఉంటాయి’ అని చెప్పారు.ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుభారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. పంటల గిట్టుబాటు ధర పెంచిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచింది. పెసర్లకు కనీస మద్దతు ధర 10 శాతం పెంపు, అలాగే, క్వింటా కందులు రూ.7వేలు, రాగులు రూ.3,846, పత్తి రూ.6,620, సోయాబీన్ రూ.4,600, నువ్వులు రూ.8,635, మొక్కజొన్న రూ.2,050, సజ్జలు రూ.2,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇది కూడా చదవండి: అమిత్ షా ఇంటి వద్ద మణిపూర్ మహిళలు నిరసన -
కడప నగరంలో సౌరకాంతులు.. రూ.113.46 కోట్లతో..
సాక్షి, కడప: జిల్లా కేంద్రమైన కడప నగరంలో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. రూ.113.46కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆ ప్లాంటు నిర్మాణానికి అవసరమయ్యే 95 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప నగరం చిన్నచౌకు గ్రామ పొలంలో 1151 నుంచి 1159 వరకూ ఉన్న సర్వేనంబర్లలో ఈ 95 ఎకరాల భూమి ఉంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పంపింగ్ ఇతర అవసరాల కోసం కడప నగరపాలక సంస్థ ప్రతినెలా సుమారు రూ.2కోట్ల మేర విద్యుత్ చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. తద్వారా ఒక ఏడాదికి రూ.24కోట్లు కరెంటు చార్జీలకే పోతోంది. కార్మికుల జీతాలు, కరెంటు చార్జీలకే సాధారణ నిధులన్నీ ఖర్చయి పోతుండటంతో నగరంలో అభివృద్ధి పనులు చేసేందు కు నిధులు మిగలడం లేదు. అధిక భారంగా మారిన కరెంటు చార్జీలను ఆదా చేసేందుకు నగర మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ సీఎం అంజద్‌బాషాల ఆధ్వ ర్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. నగరపాలక సంస్థకు ప్రతి సంవత్సరం సుమారు 3కోట్ల యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. దానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ది సిస్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారు 17 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఆరు సంవత్సరాల(72 నెలలు)పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. ఈ ఆరేళ్లలో వీధిదీపాలు, మోటార్లు, తాగునీటి సరఫరా, పంపింగ్ వంటి వాటన్నింటికీ సోలార్ పవర్‌నే వినియోగించనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ భూమిని కేటాయించడంతోపాటు 72 నెలలపాటు రూ.1.50కోట్ల చొ ప్పున ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతినెలా కరెంటు చార్జీల రూపేణా కార్పొరేషన్ విద్యుత్ శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆరేళ్ల తర్వాత అనగా నెలవారీ చెల్లింపులు పూర్తయిన పిమ్మట ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థ సొంతమవుతుంది. ఒకవేళ ప్రాజె క్టు నిర్వహణ, ఆపరేషన్ కా లం పెంచవలసి వస్తే అందుకు తగిన సర్వీసు చార్జీలను నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం కడప నగరపాలక సంస్థకు ప్రతినెలా వస్తున్న కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి సోలార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి భూమి కేటాయించడం శుభ పరిణామం. ప్రతినెలా కార్పొరేషన్ కరెంటు చార్జీల కింద విద్యుత్‌శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఆ పవర్ ప్రాజెక్టుకు చెల్లిస్తాం. ఆరేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థకు సొంతమై కరెంటు చార్జీలు మిగులుతాయి. అతి త్వరలోనే దీని పనులు ప్రారంభించి పూర్తి చేసేలా కృషి చేస్తాం. ఈ ప్రాజెక్టు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – కొత్తమద్ది సురేష్‌బాబు, మేయర్, కేఎంసీ -
ఏపీలో కొత్త జిల్లాలకు సర్వం సిద్ధం
-
AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు. కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు.. 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) 13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త) 14. గుంటూరు : గుంటూరు, తెనాలి 15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) 16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త) 17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త) 18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు 19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త) 20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల 21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త) 22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త) 23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు 24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త) 25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త) 26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య.. - శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు - విజయనగరం జిల్లా.. 27 మండలాలు - పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు - అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు - విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు - అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు - కాకినాడ జిల్లా.. 21 మండలాలు - కోనసీమ జిల్లా.. 22 మండలాలు - తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు - పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు - ఏలూరు జిల్లా.. 28 మండలాలు - కృష్ణా జిల్లా.. 25 మండలాలు - ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు - గుంటూరు జిల్లా.. 18 మండలాలు - బాపట్ల జిల్లా.. 25 మండలాలు - పల్నాడు జిల్లా.. 28 మండలాలు - ప్రకాశం జిల్లా.. 38 మండలాలు - నెల్లూరు జిల్లా.. 38 మండలాలు - కర్నూలు జిల్లా.. 26 మండలాలు - నంద్యాల జిల్లా.. 29 మండలాలు - అనంతపురం జిల్లా.. 31 మండలాలు - శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు - వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు - అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు - చిత్తూరు జిల్లా.. 31 మండలాలు - తిరుపతి జిల్లా.. 34 మండలాలు -
గ్రీన్ ఎనర్జీ కారిడార్–2కు పచ్చజెండా
న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) ఫేస్–2 ప్రాజెక్టును ఏడు రాష్ట్రాల పరిధిలో అమలు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పరిధిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్–2 ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 20 గిగావాట్ల పునరుత్పాదక (రెన్యువబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే విద్యుత్ సరఫరాకు వీలుగా, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.12,031 కోట్లు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లలో అమలు.. 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య గ్రీన్ కారిడార్ రెండో దశను అమలు చేస్తామని మంత్రి ఠాకూర్ చెప్పారు. మొదటి దశ పనులు 80 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని, మొదటి దశ కోసం రూ.10,142 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ కారిడార్–2 ప్రతిపాదిత రూ.12,031 కోట్లలో 33 శాతాన్ని (రూ.3,970 కోట్లు) కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పంపిణీ చార్జీలను కేంద్ర ప్రభుత్వ సాయంతో సర్దుబాటు చేసుకోవచ్చని.. దీంతో వ్యయాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వ సాయం అంతిమ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2030 నాటికి 450 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. గ్రీన్ కారిడార్–1 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో ఏర్పాటవుతోంది. 24 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సరఫరాకు ఇది సాయపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇది పూర్తికానుంది. మొదటి దశ కింద ఈ రాష్ట్రాల్లో 9,700 కిలోమీటర్ల మేర సరఫరా లైన్లు అందుబాటులోకి వస్తాయి. -
కొత్తగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్, అపెరల్ (పీఎం మిత్రా) పార్కుల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వస్త్ర రంగంలో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేవిధంగా రూ.4,445 కోట్లతో వీటిని నెలకొల్పాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఈ పార్కులను అభివృద్ధి చేస్తాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ బుధవారం సమావేశమైంది. మెగా టెక్స్టైల్ పార్కులతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 14 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వస్త్ర రంగం వాటాను మరింత పెంచడానికే మెగా సమీకృత టెక్స్టైల్ రీజియన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి చూపిన రాష్ట్రాల్లో గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్‌ఫీల్డ్ ప్రాంతాల్లో ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు టెక్స్టైల్ పార్కుల పట్ల ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వివాదాలు లేని 1,000 ఎకరాలకు పైగా భూమితోపాటు మెరుగైన మౌలిక వసతులు, పర్యావరణ వ్యవస్థ సిద్ధంగా ఉన్న రాష్ట్రాలు ప్రతిపాదనలు అందించాలని సూచించింది. అభివృద్ధి ఆధారిత పెట్టుబడి మద్దతు కింద గ్రీన్‌ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, బ్రౌన్ ఫీల్డ్‌కు గరిష్టంగా రూ.200 కోట్లు ఇవ్వనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతాన్ని ‘పీఎం మిత్రా’ అందిస్తుంది. రూ.300 కోట్ల ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుంది. ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ప్రాజెక్టును ఆకర్షణీయంగా రూపొందించడానికి గ్యాప్ ఫండ్ సైతం అందజేయనుంది. టెక్స్టైల్ పార్కులో వర్కర్స్ హాస్టళ్లు, హౌసింగ్, లాజిస్టిక్ పార్క్, గిడ్డంగులు, వైద్య, శిక్షణ, నైపుణ్య అభివృద్ధి తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తయారీ కార్యకలాపాల కోసం 50 శాతం భూమి, యుటిలిటీల కోసం 20 శాతం, వాణిజ్యాభివృది్ధకి 10 శాతం భూమిని వినియోగిస్తారు. నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా 78 రోజుల వేతనం రైల్వే ఉద్యోగులకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో సుమారు 11.56 లక్షల మంది నాన్–గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ బోనస్‌తో ఖజానాపై రూ.1,984.73 కోట్ల మేర భారం పడనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అర్హులకు బోనస్ కింద గరిష్టంగా రూ.17,951 దక్కనుంది. -
ఉద్యోగకల్పనకు రూ. 23,000 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కల్లోలం నేపథ్యంలో వ్యాపార సంస్థలను ఉద్యోగ కల్పనకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన (ఏబీఆర్‌వై) పథకం పట్టాలెక్కనుంది. ఈ స్కీమ్ కోసం మొత్తం రూ.22,810 కోట్ల నిధుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద కోవిడ్ రికవరీ దశలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహం అలాగే సంస్థాగత రంగంలో ఉపాధిని పెంపునకు తోడ్పాటు కోసం ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’కు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రస్తుత 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,584 కోట్ల వ్యయ కేటాయింపునకు, అదేవిధంగా మొత్తం స్కీమ్ కాల వ్యవధికి (2020–23) గాను రూ.22,810 కోట్ల వ్యయానికి కేబినెట్ ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఏబీఆర్‌వై స్కీమ్‌లో భాగంగా 2020 అక్టోబర్ 1 తర్వాత, 2021 జూన్ వరకు కొత్తగా ఉద్యోగాలను కల్పించిన సంస్థలకు రెండేళ్ల పాటు సబ్సిడీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని కేబినెట్ సమావేశం అనంతరం కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వివరించారు. పథకం సంగతిదీ... 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. అయితే, 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు, 2020 అక్టోబర్ 1 తేదీకి ముందు ఈపీఎఫ్ఓలో నమోదైన ఏ సంస్థలో కూడా పనిచేయని, యూనివర్సల్ పర్మనెంట్ నంబర్ (యూఏఎన్) లేని ఒక ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి) ఈ స్కీమ్‌కు అర్హుడు. కోవిడ్ సమయంలో, 2020 మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగి (నెల వేతనం రూ.15,000 లోపు ఉండాలి), సెప్టెంబర్ 30, 2020 వరకూ ఈపీఎఫ్ఓ కవరేజీ ఉన్న ఏ సంస్థలోనూ చేరకుండా ఉన్నా కూడా ఈ స్కీమ్ ప్రయోజనానికి అర్హత లభిస్తుంది. ఆధార్‌తో అనుసంధానమైన సభ్యుల ఖాతాలోకి ఎలక్ట్రానిక్ విధానంలో భవిష్య నిధి వాటా మొత్తాన్ని ఈపీఎఫ్ఓ జమ చేస్తుంది. కేబినెట్ ఇతర నిర్ణయాలు.. ► కోచి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) కనెక్టివిటీని కల్పించే ప్రాజెక్టుకు ఆమోదం. దీనికి రూ.1,072 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ► భారత్, సురినామ్ మధ్య ఆరోగ్యం, వైద్య రంగాల్లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన ఒప్పందానికి ఓకే. ► భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ, లగ్జెంబర్గ్ క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సీఎస్‌ఎస్‌ఎఫ్ మధ్య ఒప్పందం. -
ఎన్ఆర్ఏతో పారదర్శకతకు పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు కోట్లాది యువతకు ప్రయోజనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఏతో పలు పరీక్షలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోగా.. సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఎన్ఆర్ఏతో ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత నెలకొంటుందని ప్రధాని బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటైన ఎన్ఆర్ఏతో నియామక ప్రక్రియలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. చదవండి : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం -
వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ బేటీలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ బేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 1న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్ 5న వైఎస్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ బేటీలో మంత్రులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్లో అపెక్స్ కౌన్సిల్‌పై కూడా చర్చించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు రూ.26 వేల 872 కోట్ల రుణాలు అందించామని.. రూ.60 కోట్లతో టొబాకో రైతులను ఆదుకున్నామని మంత్రి నాని వెల్లడించారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ►వైఎస్సార్ బీమా కింద సామాజిక భద్రతా పథకం ఈ పథకం 18-50 ఏళ్ల మధ్య వారికి వర్తిస్తుంది. సహజ మరణం పొందితే రూ.2లక్షల పరిహారం అందుతుంది. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న సూమారు కోటి 50లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.583.5 కోట్లు ఖర్చు చేయనుంది. ►చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం ►వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం ►విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో దాదాపు రూ.510 కోట్ల వ్యయంతో అదనంగా 2 యూనిట్లు ఏర్పాటుకు ఆమోదం ►వైఎస్సార్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం. ►రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకూ ఆమోదం. ►వై.ఎస్సార్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం ►నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్ ఆమోదం ►రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం 2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా ►ఏపీఐఐసీ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీబీడీఐసీ) ఏర్పాటు ►వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మంత్రిమండలి రూ.10వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు ఎలక్ట్రానిక్ రంగంలో కీలక పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు ►భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం ఫేజ్ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చనున్న పోర్టు ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్ చేయాలన్న లక్ష్యం 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్ లక్ష్యం ►ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్( క్వాలిటీ కంట్రోల్ ) యాక్టు-2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం -
ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ శుక్రవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపును చేపడతారు. 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్‌ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది. కాగా, 2019 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వర్తింపచేసే డీఏను మూల వేతనంలో 12 శాతం నుంచి 17 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక -
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: అశోక్ గహ్లోత్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ శుక్రవారం వెల్లడించారు. మహిళల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ అదేశించారని తెలిపారు. పార్లమెంట్లో కూడా మహిళల రిజర్వేషన్ల కోసం సోనియా గాంధీ తీవ్రంగా కృషి చేస్తున్నారని గహ్లోత్ పేర్కొన్నారు. తమ పోరాటం ఫలితంగా ఆ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని, ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉందన్నారు. కాగా రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు గహ్లోత్ వెల్లడించారు. -
ఆధార్ అడిగితే రూ.కోటి జరిమానా!
న్యూఢిల్లీ: గుర్తింపు వివరాలు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు మాత్రమే కావాలంటూ బ్యాంకులు, టెలికాం సంస్థలు ఒత్తిడి చేయడం కుదరదిక! ఇలా బలవంతం చేసే సంస్థలు, కంపెనీలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు.. అందుకు బాధ్యులైన సిబ్బందికి జైలు శిక్ష పడేలా కేంద్రప్రభుత్వం నిబంధనలు సవరించింది. శిక్షాకాలం మూడు నుంచి పదేళ్ల వరకు ఉండనుంది. ఈమేరకు సవరించిన నిబంధనలకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే కొత్త సవరణలు అమల్లోకి రానున్నాయి. కాగా వినియోగదారులు కావాలంటే తమ ఆధార్ గుర్తింపును కూడా కేవైసీ ప్రక్రియ కోసం ఉపయోగించుకునేలా సవరణలు చేశారు. ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత టెలీగ్రాఫ్, పీఎంఎల్ఏ చట్టాలకు కేంద్రం సవరణలు చేసింది. ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ కార్డు తప్పనిసరి చేయవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. మొబైల్ కనెక్షన్, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వినియోగదారులు సాధారణంగా పాస్‌పోర్టులు, రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తమ రాష్ట్రాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అయితే రాష్ట్రాలు కూడా సుప్రీం తీర్పునకు అనుగుణంగానే వ్యవహరించాలని సూచించింది. ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేలు జరిమానతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. ఎయిమ్స్ ఏర్పాటుకు రూ. 1028 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసింది. మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
‘జోనల్’కు కేబినెట్ ఆమోదం; ఢిల్లీకి సీఎం కేసీఆర్
హైదరాబాద్: నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. విస్తృత చర్చ అనంతరం జోనల్ వ్యవస్థ, బీమా పథకాలను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ఆహ్వానం మేరకు టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస గౌడ్, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానమంత్రిని కోరడానికిగానూ సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేబినెట్ ఆమోదించిన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ► తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. ►తెలంగాణలో ఇకపై ఉద్యోగుల నియామకానికి జిల్లా, జోన్, మల్టీ జోన్, స్టేట్ కేడర్లు ఉంటాయి. ►స్టేట్ కేడర్ పోస్టులను ఖచ్చితంగా పదోన్నతి ద్వారానే భర్తీ చేస్తారు. ► ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాబ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు ఎక్కడ విద్యాబ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతం (లోకల్ ఏరియా)గా గుర్తిస్తారు. ►అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది. ►రాష్ట్రంలోని 18-60 ఏండ్ల వయస్సున్న ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవితబీమా వర్తిస్తుంది. ►ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా అమలు చేస్తారు. ప్రతీ రైతుకు రూ.2,271 చొప్పున ప్రతీ ఏడాది ప్రీమియం కడతారు. బీమా ప్రీమియానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయిస్తుంది. జూన్ 2 నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా సర్టిఫికెట్లు అందిస్తారు. ►వైద్య ఆరోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సాలకు పెంచుతారు. ► రాష్ట్ర రైతు సమన్వయ సమితికి ఎండీతో పాటు ఇతర వైద్యసిబ్బందిని నియమిస్తారు. -
4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే!
రీ ఇంజనీరింగ్‌కు కేబినెట్ ఆమోదం • దేవాదుల, కంతనపల్లి, కాళేశ్వరం, పాలమూరులలో మార్పులు • రూ.20 వేల కోట్ల మేర సవరించిన అంచనాలకు ఆమోదం • రూ.10,876 కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు • ఇందులో మల్లన్నసాగర్‌కే రూ.7,249.52 కోట్లు • మరో రూ.2 వేల కోట్లతో నీటి సరఫరా వ్యవస్థలు • రిజర్వాయర్లకు కొత్తగా టెండర్లు.. నీరందించే పనులు పాతవారికే • కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.7,860 కోట్ల ఆంధ్రా బ్యాంకు రుణం • తుమ్మిళ్ల ఎత్తిపోతలకు దక్కని మోక్షం సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కుగా కలిగిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా పలు ప్రాజెక్టుల పరిధిలో చేసిన మార్పులు చేర్పులు (రీ ఇంజనీరింగ్)కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందు బాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందిం చడం, ముంపు తక్కు వగా ఉండేలా చూడ టం, అదనపు రిజ ర్వాయర్ల నిర్మా ణం వంటి అంశాలకు ప్రాధాన్య మిస్తూ కాళేశ్వరం, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెం, పాలమూరు ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్‌కు ఆమోదం తెలిపింది. సాగు విస్తీర్ణాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో సవరించిన అంచనాలతో సుమారు రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది. కాళేశ్వరంలో ఐదు రిజర్వాయర్లు ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్తోపాటు మరో 4 రిజర్వాయర్ల నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. మొత్తంగా రూ.10,876 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఐదు రిజర్వాయర్లు చేపట్టనుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే మల్లన్న సాగర్‌కు 7,249.52 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. రంగ నాయక సాగర్ (3 టీఎంసీలు)కు 496.5 కోట్లు, కొండ పోచ మ్మ (7 టీఎంసీ లు)కు రూ.519.7 కోట్లు, గంధమల (9.86 టీఎంసీలు) రూ.860.25 కోట్లు గా అంచనా వేశారు. వీటి కింద ఉన్న ఆయకట్టుకు కన్వేయర్ (నీరందించే) వ్యవస్థ నిర్మాణం కోసం మరో రూ.870.12 కోట్లు వ్యయమవు తుందని లెక్కించారు. ఇక బస్వాపూర్ రిజర్వాయర్ (11.39 టీఎంసీలు)కు రూ.1,751 కోట్లు, దీని కన్వేయర్ వ్యవస్థ కోసం మరో రూ.1,132.2 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా ఈ ఐదు రిజర్వాయర్ల పరిధిలో రీఇంజనీరింగ్‌కు ముందు పనుల విలువ రూ.1,971.38 కోట్లుకాగా ప్రస్తుతం రూ.12,879.29 కోట్లకు చేరుతోంది. ఇందులో కన్వేయర్ వ్యవస్థకు సంబంధించి çరూ.2,002.32 కోట్ల పనులను ఇప్పటికే పనిచేస్తున్న ఏజెన్సీలకు అప్పగించ నుండగా... రిజర్వాయర్ల పనులకు మాత్రం కొత్తగా టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పది రోజుల్లో మొదలు కానుంది. ఇక ఇప్పటికే ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.7,860 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. దేవాదులలో మరో రిజర్వాయర్ దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 9.2 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించ నున్నారు. వరంగల్ జిల్లా ఆర్ఎస్ ఘణపూర్ మండలం మల్కాపూర్ వద్ద రూ.3,170 కోట్లతో దీనిని చేపట్టనున్నారు. వాస్తవానికి తొలుత దేవాదుల ద్వారా గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని తీసుకుని.. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆయకట్టుకు నీరు సరిపోదని తేల్చి.. కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచింది. ఇందుకు సరిపడా రిజర్వాయర్లు లేకపోవడంతో మల్కాపూర్ వద్ద కొత్త రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయిం చింది. ధర్మసాగర్ చెరువు నుంచి 90 రోజుల పాటు రోజుకి 1,200 క్యూసెక్కుల చొప్పున 9.2 టీఎంసీలను మల్కాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే లా డిజైన్ చేశారు. దీనికి 72 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా.. 1,660 హెక్టార్ల మేర ముంపు ఉండనుంది. మొత్తంగా దేవా దుల ప్రాజెక్టుకు 2009లో రూ.9,427 కోట్ల అంచనా వేయగా... తాజాగా రూ.13,445 కోట్లకు చేరుతోంది. ఈ అంచనాలకు ప్రభు త్వం ఓకే చెప్పింది. ఇక దేవాదుల ఫేజ్–3 ప్యాకేజీ–2లో భాగంగా భీమ్ ఘణపూర్ నుంచి రామప్ప వరకు రూ.531 కోట్లతో నిర్మించాల్సిన టన్నెల్ పనులను రద్దు చేసి.. రామప్ప దేవాలయానికి ఇబ్బంది లేకుండా పైప్‌లైన్ వ్యవస్థ నిర్మించనున్నారు. దీనికి రూ.1,136 కోట్లకు అంచనాలు వేయగా.. హైకోర్టు ఆదేశాల మేరకు దీన్ని పాత వారికే రూ.1,101 కోట్లతో అప్పగించనున్నారు. పాలమూరు ప్యాకేజీల్లో మార్పులు పాలమూరులోని ప్యాకేజీ–1. 16లలో మార్పులకు కేబినెట్ ఓకే చెప్పింది. అటవీ, భూసేకరణ ఇబ్బందుల దృష్ట్యా ప్యాకేజీ–1లో పంప్ హౌజ్‌ను భూగర్భంలో నిర్మిస్తారు. దీంతో ప్రాజెక్టుపై రూ.13 కోట్ల భారం తగ్గుతోంది. ప్యాకేజీ–16లోని ఉద్ధండాపూర్ రిజర్వాయర్ స్టేజ్ పంప్‌హౌజ్ వద్ద భూసేకరణ, రైల్వే క్రాసింగ్ సమస్యల కార ణంగా మొత్తం టన్నెల్ నిర్మించనున్నారు. దీంతో రూ.16 కోట్ల భారం తగ్గనుంది. తుమ్మిళ్లకు దక్కని మోక్షం! తుంగభద్ర జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) నుంచి రాష్ట్రానికి ఉన్న వాటా వినియోగంలో లోటును పూ డ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేప ట్టారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు. దీంతో రూ.780 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని భావించారు. కానీ రిజర్వాయర్ల విషయంలో భిన్నాభి ప్రాయాలతో పక్కన పెట్టారు. దుమ్ముగూడెం కాంట్రాక్టులు రద్దు రాష్ట్ర విభజన కారణంగా కొన్ని మండలాలు ఏపీలో విలీనం కావడంతో రద్దయిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం పనులతో పాటు పూర్తిగా పక్కనపెట్టిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ పనులను ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టు ఏజెన్సీ చెప్పినట్లుగా బ్యాంకు గ్యారెంటీ, ఇన్సూరెన్స్, ఇతర సొమ్మును తిరిగిచ్చేస్తూ ఏజెన్సీలతో రద్దు పత్రాలపై సంతకాలు చేయించుకోనుంది. కంతనపల్లి ఔట్! కంతనపల్లి ప్రాజెక్టుతో ముంపు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా తుపాకుల గూడెం బ్యారేజీకి ప్రభుత్వం ఓకే చెప్పింది. కంతనపల్లికి రూ.1,809 కోట్లతో అంచనా వేయగా.. ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్తో రూ.1,643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. ప్రాజెక్టు తుపాకులగూడెం వద్దకు మారడంతో కొత్తగా రూ.2,121 కోట్లతో అం చనాలు సిద్ధం చేశారు. పాత రేట్లతోనే పనులు చేస్తామని కంతనపల్లి కాంట్రాక్టు సంస్థ ముందుకు రావడంతో.. ఆ సంస్థకే అప్పగించేలా నిర్ణయించారు. ఏఎ మ్మార్పీ ఎస్ఎల్బీసీ కింద ఉన్న లింక్ కెనాల్–2కు సవరించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. దీనిని రూ.8 కోట్లతో చేపట్టగా.. ప్రస్తుతం రూ.12 కోట్లతో పాత వారికే అప్పగించేలా నిర్ణయం జరిగింది. -
ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం
వేధింపులకు పాల్పడేవారికి జైలుతోపాటు భారీ జరిమానా రెండోసారి అయితే నిర్భయ కేసు యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని బలోపేతం చేస్తూ కొత్త చట్టం ముసాయిదాకు కేబినెట్ ఆమోదం సాక్షి, హైదరాబాద్: ఇకపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారు కటకటాలు లెక్కించడంతోపాటు భారీ జరిమానా చెల్లించక తప్పదు! ఈ మేరకు శిక్షలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈవ్ టీజింగ్ నిరోధ చట్టాన్ని రూపొందిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రత కమిటి చేసిన సిఫారసుల ఆధారంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. ఈ చట్టం ముసాయిదాను ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిం చింది. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే నిందితులకు జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించనున్నారు. నేర తీవ్రత బట్టి ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మొదలుకుని ప్రతి ప్రైవేటు సంస్థల్లో ఈవ్ టీజిం గ్ను నిరోధించడానికి యాజమాన్యం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. లేకుంటే యాజమాన్యాన్ని కూడా శిక్షించవచ్చని ఈ ముసాదాలో పేర్కొన్నారు. టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి పట్టుబడితే నిర్భయ కేసు పెట్టాలని సూచించారు. టీజింగ్ కారణంగా ఎవరైనా మరణి స్తే నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించే నిబంధనను కూడా చేర్చినట్టు సమాచారం.