సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు.
కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.
కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..
1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం
6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,
7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)
9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)
11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)
13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)
14. గుంటూరు : గుంటూరు, తెనాలి
15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల
21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)
22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)
25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.
కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..
- శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు
- విజయనగరం జిల్లా.. 27 మండలాలు
- పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు
- విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు
- అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు
- కాకినాడ జిల్లా.. 21 మండలాలు
- కోనసీమ జిల్లా.. 22 మండలాలు
- తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు
- పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు
- ఏలూరు జిల్లా.. 28 మండలాలు
- కృష్ణా జిల్లా.. 25 మండలాలు
- ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు
- గుంటూరు జిల్లా.. 18 మండలాలు
- బాపట్ల జిల్లా.. 25 మండలాలు
- పల్నాడు జిల్లా.. 28 మండలాలు
- ప్రకాశం జిల్లా.. 38 మండలాలు
- నెల్లూరు జిల్లా.. 38 మండలాలు
- కర్నూలు జిల్లా.. 26 మండలాలు
- నంద్యాల జిల్లా.. 29 మండలాలు
- అనంతపురం జిల్లా.. 31 మండలాలు
- శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు
- వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు
- అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు
- చిత్తూరు జిల్లా.. 31 మండలాలు
- తిరుపతి జిల్లా.. 34 మండలాలు
Comments
Please login to add a commentAdd a comment