4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే! | Cabinet approved for 4 projects re-engineering | Sakshi
Sakshi News home page

4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే!

Published Fri, Feb 3 2017 1:45 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM

4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే! - Sakshi

4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే!

రీ ఇంజనీరింగ్‌కు కేబినెట్‌ ఆమోదం
దేవాదుల, కంతనపల్లి, కాళేశ్వరం, పాలమూరులలో మార్పులు
రూ.20 వేల కోట్ల మేర సవరించిన అంచనాలకు ఆమోదం
రూ.10,876 కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు
ఇందులో మల్లన్నసాగర్‌కే రూ.7,249.52 కోట్లు
మరో రూ.2 వేల కోట్లతో నీటి సరఫరా వ్యవస్థలు
రిజర్వాయర్లకు కొత్తగా టెండర్లు.. నీరందించే పనులు పాతవారికే
కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.7,860 కోట్ల ఆంధ్రా బ్యాంకు రుణం
తుమ్మిళ్ల ఎత్తిపోతలకు దక్కని మోక్షం


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కుగా కలిగిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా పలు ప్రాజెక్టుల పరిధిలో చేసిన మార్పులు చేర్పులు (రీ ఇంజనీరింగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందు బాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందిం చడం, ముంపు తక్కు వగా ఉండేలా చూడ టం, అదనపు రిజ ర్వాయర్ల నిర్మా ణం వంటి అంశాలకు ప్రాధాన్య మిస్తూ కాళేశ్వరం, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెం, పాలమూరు ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్‌కు ఆమోదం తెలిపింది. సాగు విస్తీర్ణాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో సవరించిన అంచనాలతో సుమారు రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

కాళేశ్వరంలో ఐదు రిజర్వాయర్లు
ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌తోపాటు మరో 4 రిజర్వాయర్ల నిర్మాణానికి కేబినెట్‌ ఓకే చెప్పింది. మొత్తంగా రూ.10,876 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఐదు రిజర్వాయర్లు చేపట్టనుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టే మల్లన్న సాగర్‌కు 7,249.52 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. రంగ నాయక సాగర్‌ (3 టీఎంసీలు)కు 496.5 కోట్లు, కొండ పోచ మ్మ (7 టీఎంసీ లు)కు రూ.519.7 కోట్లు, గంధమల (9.86 టీఎంసీలు) రూ.860.25 కోట్లు గా అంచనా వేశారు. వీటి కింద ఉన్న ఆయకట్టుకు కన్వేయర్‌ (నీరందించే) వ్యవస్థ నిర్మాణం కోసం మరో రూ.870.12 కోట్లు వ్యయమవు తుందని లెక్కించారు. ఇక బస్వాపూర్‌ రిజర్వాయర్‌ (11.39 టీఎంసీలు)కు రూ.1,751 కోట్లు, దీని కన్వేయర్‌ వ్యవస్థ కోసం మరో రూ.1,132.2 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా ఈ ఐదు రిజర్వాయర్ల పరిధిలో రీఇంజనీరింగ్‌కు ముందు పనుల విలువ రూ.1,971.38 కోట్లుకాగా ప్రస్తుతం రూ.12,879.29 కోట్లకు చేరుతోంది. ఇందులో కన్వేయర్‌ వ్యవస్థకు సంబంధించి çరూ.2,002.32 కోట్ల పనులను ఇప్పటికే పనిచేస్తున్న ఏజెన్సీలకు అప్పగించ నుండగా... రిజర్వాయర్ల పనులకు మాత్రం కొత్తగా టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పది రోజుల్లో మొదలు కానుంది. ఇక ఇప్పటికే ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.7,860 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు.

దేవాదులలో మరో రిజర్వాయర్‌
దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 9.2 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించ నున్నారు. వరంగల్‌ జిల్లా ఆర్‌ఎస్‌ ఘణపూర్‌ మండలం మల్కాపూర్‌ వద్ద రూ.3,170 కోట్లతో దీనిని చేపట్టనున్నారు. వాస్తవానికి తొలుత దేవాదుల ద్వారా గోదావరి నుంచి 38.16 టీఎంసీల నీటిని తీసుకుని.. వరంగల్, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆయకట్టుకు నీరు సరిపోదని తేల్చి.. కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచింది. ఇందుకు సరిపడా రిజర్వాయర్లు లేకపోవడంతో మల్కాపూర్‌ వద్ద కొత్త రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయిం చింది. ధర్మసాగర్‌ చెరువు నుంచి 90 రోజుల పాటు రోజుకి 1,200 క్యూసెక్కుల చొప్పున 9.2 టీఎంసీలను మల్కాపూర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే లా డిజైన్‌ చేశారు.

దీనికి 72 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా.. 1,660 హెక్టార్ల మేర ముంపు ఉండనుంది. మొత్తంగా దేవా దుల ప్రాజెక్టుకు 2009లో రూ.9,427 కోట్ల అంచనా వేయగా... తాజాగా రూ.13,445 కోట్లకు చేరుతోంది. ఈ అంచనాలకు ప్రభు త్వం ఓకే చెప్పింది. ఇక దేవాదుల ఫేజ్‌–3 ప్యాకేజీ–2లో భాగంగా భీమ్‌ ఘణపూర్‌ నుంచి రామప్ప వరకు రూ.531 కోట్లతో నిర్మించాల్సిన టన్నెల్‌ పనులను రద్దు చేసి.. రామప్ప దేవాలయానికి ఇబ్బంది లేకుండా పైప్‌లైన్‌ వ్యవస్థ నిర్మించనున్నారు. దీనికి రూ.1,136 కోట్లకు అంచనాలు వేయగా.. హైకోర్టు ఆదేశాల మేరకు దీన్ని పాత వారికే రూ.1,101 కోట్లతో అప్పగించనున్నారు.

పాలమూరు ప్యాకేజీల్లో మార్పులు
పాలమూరులోని ప్యాకేజీ–1. 16లలో మార్పులకు కేబినెట్‌ ఓకే చెప్పింది. అటవీ, భూసేకరణ ఇబ్బందుల దృష్ట్యా ప్యాకేజీ–1లో పంప్‌ హౌజ్‌ను భూగర్భంలో నిర్మిస్తారు. దీంతో ప్రాజెక్టుపై రూ.13 కోట్ల భారం తగ్గుతోంది. ప్యాకేజీ–16లోని ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్‌ స్టేజ్‌ పంప్‌హౌజ్‌ వద్ద  భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌ సమస్యల కార ణంగా మొత్తం టన్నెల్‌ నిర్మించనున్నారు. దీంతో రూ.16 కోట్ల భారం తగ్గనుంది.

తుమ్మిళ్లకు దక్కని మోక్షం!
తుంగభద్ర జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) నుంచి రాష్ట్రానికి ఉన్న వాటా వినియోగంలో లోటును పూ డ్చేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేప ట్టారు. ఆర్డీఎస్‌ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు. దీంతో రూ.780 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టాలని భావించారు. కానీ రిజర్వాయర్ల విషయంలో భిన్నాభి ప్రాయాలతో పక్కన పెట్టారు.

దుమ్ముగూడెం కాంట్రాక్టులు రద్దు
రాష్ట్ర విభజన కారణంగా కొన్ని మండలాలు ఏపీలో విలీనం కావడంతో రద్దయిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ దుమ్ముగూడెం పనులతో పాటు పూర్తిగా పక్కనపెట్టిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ పనులను ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టు ఏజెన్సీ చెప్పినట్లుగా బ్యాంకు గ్యారెంటీ, ఇన్సూరెన్స్, ఇతర సొమ్మును తిరిగిచ్చేస్తూ ఏజెన్సీలతో రద్దు పత్రాలపై సంతకాలు చేయించుకోనుంది.

కంతనపల్లి ఔట్‌!
కంతనపల్లి ప్రాజెక్టుతో ముంపు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా తుపాకుల గూడెం బ్యారేజీకి ప్రభుత్వం ఓకే చెప్పింది. కంతనపల్లికి రూ.1,809 కోట్లతో అంచనా వేయగా.. ఓ కాంట్రాక్టు సంస్థ 9% లెస్‌తో రూ.1,643.67 కోట్లకు పనులు దక్కించుకుంది. ప్రాజెక్టు తుపాకులగూడెం వద్దకు మారడంతో కొత్తగా రూ.2,121 కోట్లతో అం చనాలు సిద్ధం చేశారు. పాత రేట్లతోనే పనులు చేస్తామని కంతనపల్లి కాంట్రాక్టు సంస్థ ముందుకు రావడంతో.. ఆ సంస్థకే అప్పగించేలా నిర్ణయించారు. ఏఎ మ్మార్పీ ఎస్‌ఎల్‌బీసీ కింద ఉన్న లింక్‌ కెనాల్‌–2కు సవరించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. దీనిని రూ.8 కోట్లతో చేపట్టగా.. ప్రస్తుతం రూ.12 కోట్లతో పాత వారికే అప్పగించేలా నిర్ణయం జరిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement