సాక్షి,ఢిల్లీ:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం(డిసెంబర్28) కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మన్మోహన్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా,శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది.
మన్మోహన్‌సింగ్(92) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన ఆర్థికవేత్త,ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌కు గొప్ప పేరున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: మన్మోహన్‌సింగ్ అస్తమయం
Comments
Please login to add a commentAdd a comment