నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించలేం | No financial help to unemployed | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించలేం

Published Fri, Mar 10 2017 1:22 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించలేం - Sakshi

నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించలేం

యనమల రామకృష్ణుడు స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్‌ అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటించేలా ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 11.30 గంటలకు 2017–18 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని యనమల తేల్చిచెప్పారు. ఉద్యోగాలు లేనివారికి ఉచితంగా ఆర్థిక సాయం అందించడం సాధ్యం కాదని చెప్పారు.  ఉద్యోగాలు లేని యువతకు డబ్బులిచ్చి ఊరికే తిరగమనడం మంచిది కాదని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement