
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాదారులతోపాటు ఇతరులకు ఆర్థిక లబ్ధి కల్పించడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును విస్తృతం చేసే పలు పథకాలను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి మోదీ ప్రకటించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎండీజేవై) కింద జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాలున్న వారికి రూ.10వేల వరకు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనుంది. రూపే కార్డు దారులకు ఉచిత ప్రమాద బీమా మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.లక్ష నుంచి మరింత పెంచనుంది. సూక్ష్మ బీమా పథకాన్ని కూడా తీసుకురానున్నారు. వీటితోపాటు అసంఘటిత రంగ కార్మికులకు మాత్రమే ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పింఛను మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచనున్నట్లు కూడా ప్రకటించవచ్చునని సమాచారం. ప్రభుత్వం 2014లో ప్రకటించిన పీఎండీజేవై కింద 32.25 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా రూ.80,674.25 కోట్లు జమ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment