
లారెన్స్ మళ్లీ ఆదుకున్నాడు
చెన్నై: ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురికి గుండె శస్త్ర చికిత్సలకు ఆర్థికసాయం అందిస్తున్న లారెన్స్ సోమవారం అభినేష్ అనే మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.
లారెన్స్ పలు సినిమాలతో పాటు పలు రకాల సామాజిక సేవలు నిర్వహిస్తూ వికలాంగ, అనాథాశ్రమాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలువురిని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. లారెన్స్ తన కన్నతల్లిపైగల అపార ప్రేమకు చిహ్నంగా ఒక గుడిని కట్టిస్తున్నారు. త్వరలో ఆ గుడిలో తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా లారెన్స్ గుండె శస్త్ర చికిత్సకు ఆర్థిక సాయం అందించిన వారి సంఖ్య అభినేష్‌తో 130కి చేరుకుంది.