సింగర్‌ శ్రేయా ఘోషల్‌ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్‌ కంపెనీ.. Do You Know Who is Singer Shreya Ghoshal Husband and His Job | Sakshi
Sakshi News home page

వందల కోట్లు సంపాదించిన శ్రేయో ఘోషల్‌.. ఆమె భర్త ఏం చేస్తారో తెలుసా?

Published Sun, Jun 23 2024 6:53 PM | Last Updated on Sun, Jun 23 2024 7:17 PM

Do You Know Who is Singer Shreya Ghoshal Husband and His Job

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.

ట్రూకాలర్‌ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.

భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.

ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్‌లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement