Singer Shreya Ghoshal
-
సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్ కంపెనీ..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్‌గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్‌లో బిజినెస్ గ్లోబల్ హెడ్‌గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు. -
ఆ ‘షో’ కెరీర్‌ను మలుపు తిప్పింది
శ్రేయా ఘోషల్... పాటలతోనే కాదు అందంతోనూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. అతిచిన్న వయసులో అత్యున్నత స్థాయికి ఎదిగి 5 జాతీయ అవార్డులతో పాటు మరెన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, ప్రశంసలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఏ భాషలో పాడినా ఆ పాటకే అందం వస్తుంది. ఆ పాటలోని మాధుర్యాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా పాడి ఎందరో అభిమానులు సంపాదించుకుంది. సినిమాలో శ్రేయా పాడిన మొదటి పాట.. ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. శ్రేయా ఘోషల్. పుట్టినరోజు సందర్భంగా ఆమె గొంతులో జాలువారిన పాటల ప్రయాణంపై సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
వీళ్లు ఎంతో సుకుమారులు...
ఆస్ట్రోఫన్డా: మీన రాశి రాశిచక్రంలో చివరి రాశి మీనం. ఇది సరి రాశి. జలతత్వం, బ్రాహ్మణ జాతి, సౌమ్య రాశి, ఉజ్వల వర్ణం. శరీరంలో కాళ్లను, పాదాలను సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, దిశ ఉత్తరం. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాలు పూర్తిగా ఉంటాయి. ఈ రాశి అధిపతి గురువు. ఈ రాశి వైఢూర్యాలు, ముత్యాలు, వజ్రాలు, గోరోజనం, చేపలు, మద్యం మొదలైన ద్రవ్యాలను సూచిస్తుంది. ఇది రష్యా, ఈజిప్టు పరిసర ప్రాంతాలపై ప్రభావం కలిగి ఉంటుంది. మీనరాశిలో పుట్టినవారు కాస్త సుకుమారులు. కాస్త బద్ధకస్తులు కూడా. కఠిన శ్రమను తట్టుకోలేరు. అయితే, అద్భుతమైన సృజనాత్మకత వీరి సొంతం. సుఖలాలస ఎక్కువ. కల్లా కపటం తెలియని వీరు, ఎదుటి వారిని ఇట్టే నమ్మే స్తారు. కొన్ని సందర్భాల్లో పిరికిగా వ్యవహ రించినా, అవసరమైన సందర్భాల్లో ధైర్య సాహసాలనూ ప్రదర్శించగలరు. సరళ స్వభావం కారణంగా తేలికగా ఆకట్టు కుంటారు. నిష్పాక్షికత, సహనం, అపారమైన ఊహాశక్తి, వాక్చాతుర్యం, కార్యనిర్వహణ నైపుణ్యాల ఫలితంగా ఏ రంగంలోనైనా రాణించగలరు. రచయితలు, సినీ దర్శకులు, నటులు, వైద్యులు, రసాయన నిపుణులు, సాంకేతిక నిపుణులు, బోధకులు, సామాజిక కార్యకర్తలుగా బాగా రాణిస్తారు. ఆహార పానీయాలు, రవాణా, ముద్రణ, ప్రచురణ వంటి రంగాల్లో సొంత వ్యాపారాలు కూడా వీరికి అనుకూలం. రక్షణ, విద్య, జల వనరులు, షిప్పింగ్, రైల్వే, బ్యాంకింగ్, బీమా రంగాలలోని ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. గ్రహగతులు అనుకూలించకుంటే, స్థిరపడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా తిరుగుతారు. నిజాయితీ లేని పనులతో నిందల పాలవుతారు. మోసాలకు గురై నష్ట పోతూ ఉంటారు. బద్ధకంతో అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యసనాల ద్వారా సాంత్వన పొందేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు, వాత సంబంధ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు మీనరాశిలో పుట్టిన గాయని శ్రేయాఘోషల్