
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.
దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్‌కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.
అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment