ఐటీ ఉద్యోగార్థులకు గత కొన్ని నెలలుగా గడ్డుకాలమే నడుస్తోంది. రానున్న ఆరు నెలలు మరింత గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఫ్రెషర్‌ల నియామకాన్ని మందగించాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
(టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..)
క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్‌లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తుతం బెంచ్‌లో ఉన్నవారిని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో చాలా ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు.
ఇప్పటికే తమ వద్ద ఎక్కువమందితో కూడిన ఫ్రెషర్ బెంచ్ ఉందని ఇన్ఫోసిస్ చెబుతోంది. "ప్రస్తుతం మేము ఇంకా క్యాంపస్‌లకు వెళ్లడం లేదు" అని కంపెనీ క్యూ2 ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్ అన్నారు. గత ఏడాది కంపెనీ దాదాపు 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది.
విప్రో తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తామని చెబుతూ ఫ్రెషర్ల నియామకాలపై చేతులెత్తేసింది. అయితే స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో 2024 ఆర్థిక సంవత్సరం ఔట్‌లుక్ హెడ్‌కౌంట్‌లో 2023 ఆర్థికేడాది ముగింపు కంటే 2.4 శాతం నికర వార్షిక వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెడ్‌కౌంట్ సుమారు 2 లక్షలు పెరుగుతుందని అభిప్రాయపడింది. 2023 మార్చిలో 66 లక్షలు ఉన్న ఐటీ సెక్టార్ హెడ్‌కౌంట్ రానున్న మార్చి నాటికి 68 లక్షల మార్క్ కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది.
ఈ సంవత్సరం ఐటీ రంగం గణనీయమైన మార్పునకు గురైంది. ఇది ఎంట్రీ-లెవల్ స్థానాలకు డిమాండ్‌లో సుమారుగా 25-30 శాతం క్షీణించిందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment