ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.
స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment