సాక్షి, కోవూరు: ఆనాడు యువత బాగా చదువుకోవాలని తానే చెప్పానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, ఐటీని తానే తెచ్చానని అన్నారు.
‘ఐటీ ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పాను. దానికనుగుణంగానే ఐటీ ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి..’ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు తలచారని, ఆయన త్యాగ ఫలితంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ను సాధించామని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి మృతి బాధాకరమన్నారు. రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లను రౌడీలుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.
చదవండి: (సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment