అవాక్కవుతున్న ఐటీ పరిశ్రమలు.. కంపెనీ సీఈఓగా 'ఏఐ' | Onda company ceo ai chatgpt | Sakshi
Sakshi News home page

అవాక్కవుతున్న ఐటీ పరిశ్రమలు.. కంపెనీ సీఈఓగా 'ఏఐ'

Published Sun, May 28 2023 11:18 AM | Last Updated on Sun, May 28 2023 11:29 AM

Onda company ceo ai chatgpt - Sakshi

పోర్చుగీస్‌ స్టార్టప్‌ కంపెనీ ‘ఓండా’ ఇటీవల తన సీఈవోగా చాట్‌జీపీటీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను నియమించుకుంది. ఈ ఏఐ సీఈవోను నియమించుకున్న వారం రోజుల్లోనే ఈ కంపెనీ లాభాల్లో శరవేగంగా పరుగులు మొదలవడం విశేషం. కంటెంట్‌ క్రియేటర్స్‌ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ టూల్స్, సొల్యషన్స్‌ రపొందించే ‘ఓండా’ కంపెనీ సాహసోపేతమైన నిరయం తీసుకుని తన సీఈవోగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను నియమించుకుని, ఐటీ పరిశ్రమ నిపుణులను అవాకయ్యేలా చేసింది. 

(ఇదీ చదవండి: రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం)

ఏఐ సీఈవో ఈ కంపెనీ పగ్గాలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమర్థులైన వారిని ఎంపిక చేసి, కొత్తగా ఉద్యోగాల్లో నియమించుకుంది. వారం రోజులు తిరిగేలోగానే లాభాల్లో దూకుడు సాధించింది. దీనినే ఆదర్శంగా తీసుకుంటే, మిగిలిన కంపెనీలు కూడా ఏఐ సీఈవోలనే నియమించుకుంటాయేమో చూడాలి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement