
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలపై గత రెండేళ్లలో 48 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీ చెల్లింపులతో ఇంటర్‌నెట్ దిగ్గజం కాపాడిందని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించిన క్రమంలో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో సుందర్ పిచాయ్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ మేనేజర్లు కావడం గమనార్హం. ఈ ఉద్యోగులకు ఎలాంటి ఎగ్జిట్ ప్యాకేజ్ ఇవ్వలేదని పిచాయ్ పేర్కొన్నారు. సంస్ధలో లైంగిక వేధింపులు ఎదుర్కొనే బాధితులు అంతర్గత వేదికల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఈమెయిల్ పేర్కొంది. గూగుల్‌ను మెరుగైన పనిప్రదేశంగా మలిచేందుకు కృషి సాగిస్తామని, అసభ్యకరంగా వ్యవహరించే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఈమెయిల్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment