న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత తీవ్ర కలవరం పుట్టిస్తోంది. ముఖ్యంగా ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించడం ప్రస్తుత సంకక్షోభం పరిస్థితికి అద్దుపడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం ఉద్యోగాల తీసివేత నేపథ్యంలో గూగుల్ ఉ ద్యోగులు సీఈవోకు సుందర్ పిచాయ్‌కి బహిర లేఖ లేశారు. కొన్ని కీలక డిమాండ్లతో రాసిన ఈ లెటర్ హాట్ టాపిక్‌గా నిలిచింది.
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్.లో దాదాపు 1,400 మంది ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేలా లేఆఫ్ ప్రక్రియలో మెరుగైన విధానాల్ని పాటించాల కోరుతూ పిటిషన్‌పై వీరంతా సంతకం చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డిమాండ్లను చేయడం గమనార్హం. అయితే ఈ లేఖపై ఆల్ఫాబెట్ ప్రతినిధి ఇంకా స్పందించలేదు.
గూగుల్ సీఈవోకు ఉద్యోగులకు రాసిన లేఖలో ముఖ్యంగా కొత్త నియామకాలను స్తంభింప జేయడం, తొలగింపులకు ముందు స్వచ్ఛంద తొలగింపులను కోరడం, ఉద్యోగ ఖాళీల భర్తీకి తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మెటర్నిటీ, బేబీ బాండింగ్ వంటి సెలవుల్లో ఉన్న వారిని అర్థాంతరంగా తొలగించకుండా, వారి షెడ్యూల్డ్ సెలవులను పూర్తి చేయడానికి అనుమతించడం వంటి అనేక డిమాండ్లను ఇందులో ఉద్యోగులు చేశారు. దీనికి తోడు ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధ సంక్షోభ ప్రాంతాలకు చెందిన తోటి ఉద్యోగులను తొలగించవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అలా చేయటంతో అక్కడి ఉద్యోగులు వీసా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సంక్షోభ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు అదనపు సహాయాన్ని కంపెనీ అందించా లన్నారు. లింగ, జాతి, కుల, వయస్సు, మతం, వైకల్యాలు లాంటి వివక్షలు లేకుండా ఉద్యోగుల పట్ల వ్యవహరించాలని ఉద్యోగులు తమ లేఖలో సుందర్ పిచాయ్ ని కోరారు. కంపెనీ 12వేల ఉద్యోగాలను తీసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ చర్చకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment