సాధారణంగా ఎవరైనా చేస్తున్న ఉద్యోగాన్ని ఎప్పుడు వదిలేస్తారు? ఏదైనా మరో మంచి ఉద్యోగ అవకాశం చేతిలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు. కానీ బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ రూ.కోటి జీతమొచ్చే లక్షణమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు. అది కూడా చేతిలో ఎలాంటి ఆఫర్ లేకుండా..
అంతటి భారీ జీతమొచ్చే జాబ్‌ను తాను ఎందుకు విడిచిపెట్టింది.. వివరిస్తూ బెంగుళూరుకు చెందిన టెక్కీ వరుణ్ హసిజా ఇటీవల ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. బెంగుళూరులో తన ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా తాను ఒక ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకున్నట్లు హసిజా వెల్లడించారు. ఇక్కడ ఆయనకు రూ. 1 కోటి పైగా వార్షిక వేతనం వచ్చేదని వివరించారు.
కారణం ఇదే..
చేతిలో ఎటువంటి ఉద్యోగ ఆఫర్ లేకుండా భారీ జీతమొచ్చే జాబ్ నుంచి ఎందుకు విరమించిదీ వరుణ్ హసిజా ఆసక్తికరమైన కారణం చెప్పారు. దశాబ్దంపాటు కెరీర్ సాగిన తర్వాత అర్ధవంతమైన విరామం అవసరమని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిర్ణయం ఉద్వేగభరితమైనది కాదని, ఉద్యోగ అవకాశాలను అంచనా వేసేటప్పుడు తాను అనుసరించే నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా తీసుకున్నది హసిజా పేర్కొన్నారు. తన ఫ్రేమ్‌వర్క్ ఆనందం, ప్రభావం, సంపద సృష్టి అనే మూడు ప్రధాన కారకాల చుట్టూ తిరుగుతుందని వివరించారు. పనిలో ఆనందం ఉండాలనేది హసిజా సిద్ధాంతం. అన్నింటికీ అదే పునాదిగా పనిచేస్తుందని ఆయన భావన.
అంత జీతం వస్తున్నా తాను ఇప్పడు చేస్తున్న ఉద్యోగంలో సంతోషం, ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదని హసిజా కనుగొన్నారు. ఎడ్‌టెక్ రంగం ఇప్పటికే పరిశ్రమ వ్యాప్త సవాళ్లను ఎదుర్కొంటోంది. అర్ధవంతమైన పని కంటే కూడా మనుగడ వైపు దృష్టిని మార్చడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్గత మార్పులు పని ప్రదేశాన్ని అసంతృప్తికరంగా చేసింది. ఈ వాతావరణం పెరుగుతున్న ఒత్తిడితో పాటు ఆయన ప్రాధాన్యతలకు అనుగుణంగా లేని ఉద్యోగంలో కొనసాగడం విలువైనదేనా అని ప్రశ్నించేలా చేసింది.
వరుణ్ హసిజా పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. అతని పోస్ట్‌లకు 2.2 లక్షల వ్యూస్ వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయానికి ప్రశంసలు వచ్చాయి. కొందరు హసిజా ధైర్యాన్ని మెచ్చుకోగా మరికొందరు ఆర్థిక భద్రత లేకుండా అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేయడం ఆచరణాత్మకతను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment