quits job
-
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగి.. స్పాట్లో రిజైన్! ఎందుకంటే..
Employee Quits Job On Spot: ఉద్యోగం ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ చాలా మంది ఒత్తిడికి ఇదే మూల కారణం. సోషల్ మీడియా ముఖ్యంగా రెడ్డిట్ (Reddit).. ఉద్యోగులు విధుల్లో ఎదుర్కొంటున్న బాధలను పంచుకునే కేంద్రంగా మారింది. ఇటీవల CrazieIrish అనే పేరుతో ఉన్న ఒక రెడ్డిట్ యూజర్ తమ టాక్సిక్ బాస్ బూతు మాట అనడంతో స్పాట్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు షేర్ చేశారు. దీని గురించి మరింత వివరణ అడిగినప్పుడు ఆ యాజర్ కామెంట్స్‌లో పూర్తిగా తెలియజేశారు."నేను ఇంటి నుంచి పని చేస్తున్నా. కొత్త కంప్యూటర్‌కు యాక్సెస్ పొందడానికి సపోర్ట్ కోసం అతనికి (బాస్) కాల్ చేయాల్సి వచ్చింది. ఖాళీ సమయంలో కంప్యూటర్ను సెటప్ చేయనందుకు కోపంగా ఉన్న అతను బూతు మాట (F*** Off) అన్నాడు. దీంతో స్పాట్లో జాబ్ వదిలేస్తున్నట్లు చెప్పాను" అని రాసుకొచ్చారు. ఈ ఈమెయిల్‌కు తమకు ఎలాంటి రిప్లై రాలేదని పేర్కొన్నారు. ఈ రెడ్డిట్ పోస్ట్ షేర్ చేసిన కేవలం 20 గంటల్లోనే 37,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా మంది ఇంటర్నెట్ యాజర్లు కామెంట్ల రూపంలో స్పందించారు. ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది సమర్థించారు. So, I Quit My Job byu/CrazieIrish inantiwork -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్ వివరణ ఇచ్చింది. -
భారత్‌పేకు మరో షాక్, కీలక కో-ఫౌండర్ ఔట్!
సాక్షి, ముంబై: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేకు మరో షాక్ తగిలింది.సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే రెండో వ్యవస్థాపకుడు భావిక్ కొలాదియా సంస్థకు గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఇప్పటికే నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఇబ్బందులు పడుతున్న భారత్‌పే కంపెనీకి, కంపెనీ ఐటీ బ్యాక్‌బోన్‌గా ఉన్న కిలాదియా వైదొలిగారు. ఆయన కాంట్రాక్ట్ పదవీకాలం జూలై 31, 2022తో ముగిసిందని, అయితే కంపెనీ వీడేందుకే కొలాదియా నిర్ణయించుకున్నారని కంపెనీ ఆగస్టు 2న ఒక ప్రకటనలో తెలిపింది.అతిపెద్ద ఫిన్‌టెక్ కంపెనీలలో ఒకటిగా మారిన కృషిన ఆయన అంతర్భాగంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని నమ్ముతున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు భారత్‌పే తన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటని, రానున్న కాలంలో కూడా పెట్టుబడులు కొనసాగిస్తానని కొలాడియా చెప్పారు. పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే భారత్‌పేని స్థాపించిన రోజు నుంచి తాను, శాశ్వత్ భారత్‌పే, స్థాపించడంతోపాటు, దాని అభివృద్ధికి కృషి చేశామని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కంపెనీ BharatPeకి సహ వ్యవస్థాపకుడు, ఎంపీ అష్నీర్ గ్రోవర్ కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అష్నీర్ గ్రోవర్ రాజీనామా తర్వాత భారత్‌పే బోర్డు ఆయనతో పాటు ఆయన భార్య కంపెనీ నిధుల్లో భారీ అవకతవకలు చేసిన ఆరోపణలు, తర్వాత బోర్డు గ్రోవర్ మధ్య వివాదం చివరికి గ్రోవర్ రాజీనామాకు దారి తీసింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రోవర్, భరత్‌పే మేనేజ్మెంట్ మధ్య వివాదం చెలరేగినప్పుడు, కొలాడియా, గ్రోవర్ మధ్య వాగ్వాదం ఆడియో రికార్డ్ బయటపడటం కలకలం రేపింది. అటు మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం, కీలక ఎగ్జిక్యూటివ్‌లు వరుసగా కంపెనీకి గుడ్ బై చెప్పారు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుడు సత్యం నాథనిగత జూన్‌లో రాజీనామా చేశారు. ప్రధాన రెవెన్యూ అధికారి నిషిత్ శర్మ సంస్థాగత రుణ భాగస్వామ్య అధిపతి చంద్రిమా ధర్ నిష్క్రమించారు. ఆ తరువాత కొద్ది రోజులకే మరో కీలకమైన టెక్ నిపుణుడు నథాని కంపెనీని వీడారు. -
మమతకు మరో షాక్ :కీలక మంత్రి గుడ్‌బై
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వరుస పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టి వేస్తున్నాయి. తాజా కేబినెట్ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు రాజీవ్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో వరుసగా కీలక నేతలు పార్టీని వీడటం, అదీ బీజేపీ కండువా కప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బగా భావించాలి. దోంజూర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖ మంత్రి అయిన రాజీవ్ బెనర్జీ చాలా కాలంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి బెంగాల్ పర్యటనకు ముందు రాజీవ్ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఇప్పటికే టీఎంసీ ఎంపీ సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నేతృత్వంలో మరో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలాగే శాంతిపూర్‌కు చెందిన ఎమ్మెల్యే అరిందాం భట్టాచార్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. This is to inform you that I am resigning as the Minister in Charge, Department of Forest, West Bengal from today. pic.twitter.com/dfVq6aVxUj — Rajib Banerjee (@RajibBaitc) January 22, 2021 -
ఐఏఎస్ కు రాజీనామాచేసి ట్యూటర్ గా..
21వ ఏట తొలిప్రయత్నంలోనే సివిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించి సంచనం సృష్టించిన రోమన్ షైనీ మరో అనూహ్యనిర్ణయం తీసుకున్నారు. గడిచిన మూడేళ్లుగా జబల్ పూర్ అసిస్టెండ్ కలెక్టర్ గా పనిచేస్తోన్నఆయన ఉన్నతోద్యోగానికి రాజీనామాచేసి, పూర్తికాలం ఉచిత విద్యాబోధనకు పునరంకితం కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. 'ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకునే పేద అభ్యర్థులు అకాడమీలకు వెళ్లి లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేరు. అలాంటివాళ్లకోసం ప్రారంభమైందే అన్అకాడమీ. ప్రస్తుతం ఇండియాలో లార్జెస్ట్ యూట్యూబ్ ఇదే. లక్షలాది మంది విద్యార్థులు కోటికి పైగా పాఠాలను అన్ అకాడమీద్వారా ఉచితంగా నేర్చుకున్నారు. దీని వ్యవస్థాపకుడు గౌరవ్ ముఝాల్ నా ఆప్తమిత్రుడు. రెండేళ్ల నుంచి నేను కూడా అన్ అకాడమీలో పాఠాలు చెబుతూనే ఉన్నా. అయితే అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందిప్పుడు. ఐఏఎస్ అధికారిగా కంటే ఉచితంగా పాఠాలు చెప్పే ట్యూటర్ గా ఉండాలనే నిర్ణయించుకున్నా' అంటూ తన మనోగతాన్ని వెల్లడించాడు రోమన్ షైనీ. సెప్టెంబర్ లోనే షైనీ రాజీనామా చేశాడని, ఈ నెలలో డీవోపీటీ శాఖ నిర్ణయం వెలువడుతుందని జబల్ పూర్ కలెక్టర్ ఎస్ ఎన్ రూప్లా చెప్పారు.