ఏఐ రంగ ప్రవేశంతో కొత్త సవాళ్లు
ఏఐకి అనుగుణంగా డేటా సిద్ధం చేసుకుంటున్న కంపెనీలు
ఆధునిక ఆన్‌లైన్ కోర్సులపై విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల ఆసక్తి
ప్రముఖ యూనివర్సిటీలు సైతం కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న వైనం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు.. బీటెక్ చదివి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారికీ కొన్ని అత్యాధునిక సాంకేతిక కోర్సులు చేయడం అని వార్యమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో ఉద్యోగావకా శాలు మెరుగుపరుచుకునేందుకు, ఉన్న ఉద్యో గాన్ని కాపాడుకునేందుకు ఈ దిశగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రముఖ యూనివర్సిటీలు కూడా వాటిని ప్రవేశ పెట్టా ల్సిన, డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు జరిపిన సర్వే ప్రకారం 52 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదో ఒక ఆన్‌లైన్ కోర్సు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతు న్నారు.
టెక్ ఉద్యోగులు ఏకంగా 72 శాతం మంది ఆన్‌లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకుంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో ఏఐతో వచ్చే పోటీని తట్టుకోగలమని భావిస్తున్నారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 8% మంది స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లంతా ఇంజనీరింగ్‌తో సంబంధం లేని సాధారణ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. చాలామందికి పరిశ్రమలకు అవస రమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదని మద్రాస్ ఐఐటీ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు కొత్త కోర్సులు చేస్తే తప్ప ఇంజనీరింగ్ తర్వాత ఉపాధి దొరక డం కష్టంగా ఉంది.
ఐటీ ఉద్యోగుల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. కొన్నేళ్ల క్రితం సంస్థలో చేరిన ఉద్యోగికి ఇప్పుడొస్తున్న ఏఐ టెక్నాలజీపై పెద్దగా పట్టు ఉండటం లేదు. ఏఐ టెక్నాలజీ అర్హత గల వాళ్ళు సంస్థలో ఉద్యోగులుగా వస్తుండటం, యాంత్రీకరణ నేపథ్యంలో అన్ని పనులు ఏఐ టెక్నాలజీనే చేయడంతో ఆ టెక్నాలజీ లోపించిన ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.
అందుబాటులో ఎన్నో ఆన్‌లైన్ కోర్సులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో రెండేళ్లలో ఐటీ సెక్టార్‌ను సమూలంగా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ రంగంలో నిపు ణుల కొరతను దృష్టిలో ఉంచుకుని, ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రము ఖ సంస్థలు ఎన్నో కోర్సులను అందుబాటు లోకి తెచ్చాయి. వీటికి ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి మంచి స్పందన కన్పిస్తోంది.
» ఐఐటీ హైదరాబాద్ ఏఐ అండ్ ఎంఎల్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు మెరుగు పరిచే కోర్సులను అందిస్తోంది.
» మద్రాస్ ఐఐటీ బీఎస్సీ డేటా సైన్స్... నాలుగేళ్ల బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది.
» ఐఐటీ బాంబేలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఉన్నాయి.
» ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐ–ఎంఎల్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇన్ కామన్ ఇండస్ట్రీస్, సేఫ్టీ అండ్ ది లా, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులు అందిస్తోంది.
నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రణాళిక
విద్యార్థుల్లో తగిన నైపుణ్యం పెంచేలా ఆన్‌లైన్ కోర్సులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీతో ఇటీవల చర్చలు జరిపాం. ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
Comments
Please login to add a commentAdd a comment