online courses
-
అప్డేట్ అవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులే కాదు.. బీటెక్ చదివి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారికీ కొన్ని అత్యాధునిక సాంకేతిక కోర్సులు చేయడం అని వార్యమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో ఉద్యోగావకా శాలు మెరుగుపరుచుకునేందుకు, ఉన్న ఉద్యో గాన్ని కాపాడుకునేందుకు ఈ దిశగా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ కోర్సులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రముఖ యూనివర్సిటీలు కూడా వాటిని ప్రవేశ పెట్టా ల్సిన, డిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్రాస్ ఐఐటీ విద్యార్థులు జరిపిన సర్వే ప్రకారం 52 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదో ఒక ఆన్లైన్ కోర్సు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతు న్నారు. టెక్ ఉద్యోగులు ఏకంగా 72 శాతం మంది ఆన్లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే, మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా కొత్త టెక్నాలజీ కోర్సులను నేర్చుకుంటున్నారు. అప్పుడే భవిష్యత్తులో ఏఐతో వచ్చే పోటీని తట్టుకోగలమని భావిస్తున్నారు.ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 8% మంది స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా వాళ్లంతా ఇంజనీరింగ్‌తో సంబంధం లేని సాధారణ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. చాలామందికి పరిశ్రమలకు అవస రమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండటం లేదని మద్రాస్ ఐఐటీ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు కొత్త కోర్సులు చేస్తే తప్ప ఇంజనీరింగ్ తర్వాత ఉపాధి దొరక డం కష్టంగా ఉంది. ఐటీ ఉద్యోగుల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. కొన్నేళ్ల క్రితం సంస్థలో చేరిన ఉద్యోగికి ఇప్పుడొస్తున్న ఏఐ టెక్నాలజీపై పెద్దగా పట్టు ఉండటం లేదు. ఏఐ టెక్నాలజీ అర్హత గల వాళ్ళు సంస్థలో ఉద్యోగులుగా వస్తుండటం, యాంత్రీకరణ నేపథ్యంలో అన్ని పనులు ఏఐ టెక్నాలజీనే చేయడంతో ఆ టెక్నాలజీ లోపించిన ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.అందుబాటులో ఎన్నో ఆన్లైన్ కోర్సులుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో రెండేళ్లలో ఐటీ సెక్టార్‌ను సమూలంగా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఆ రంగంలో నిపు ణుల కొరతను దృష్టిలో ఉంచుకుని, ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచే ఉద్దేశంతో పలు ప్రము ఖ సంస్థలు ఎన్నో కోర్సులను అందుబాటు లోకి తెచ్చాయి. వీటికి ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి మంచి స్పందన కన్పిస్తోంది. » ఐఐటీ హైదరాబాద్ ఏఐ అండ్ ఎంఎల్, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు మెరుగు పరిచే కోర్సులను అందిస్తోంది. » మద్రాస్ ఐఐటీ బీఎస్సీ డేటా సైన్స్... నాలుగేళ్ల బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అందిస్తోంది. » ఐఐటీ బాంబేలో డిజిటల్ మార్కెటింగ్ అండ్ అప్లైడ్ అనలిటిక్స్, డిజైన్ థింకింగ్, మెషీన్ లెర్నింగ్ అండ్ ఏఐ విత్ పైథాన్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఉన్నాయి.» ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏఐ–ఎంఎల్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, సేఫ్టీ ఇన్ కామన్ ఇండస్ట్రీస్, సేఫ్టీ అండ్ ది లా, ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులు అందిస్తోంది. నైపుణ్యం పెంచే కోర్సులకు ప్రణాళిక విద్యార్థుల్లో తగిన నైపుణ్యం పెంచేలా ఆన్లైన్ కోర్సులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా మద్రాస్ ఐఐటీతో ఇటీవల చర్చలు జరిపాం. ఇంజనీరింగ్‌లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
తలరాతలు తిరగరాస్తూ..
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్‌తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది.. తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా. ఆదాయ పరిమితిని పెంచాం.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం. తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్‌లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది. హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం. చదువుల యుద్ధం.. ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. విద్యారంగంలోనూ క్లాస్ వార్.. ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్‌లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం. బాబు ఒక్క మంచీ చేయలేదు.. పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు. అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు. హాజరైన మంత్రులు, నేతలు కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నేటి విత్తనం.. రేపు మహా వృక్షం ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి. ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది. జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...! జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పిల్లల బాధ్యత తీసుకున్నారు తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్‌ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్‌కుమార్, పామర్రు ఎమ్మెల్యే విద్యార్థులకు వరంలా.. అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు. నేను ఏ ఒక్క ఆఫీస్‌కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని గొప్ప ప్రజా నాయకుడు మీరే.. మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్‌లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్వేర్ జాబ్స్‌కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా. మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి.... మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్‌లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే. కరిక్యులమ్‌ను జాబ్ ఓరియెంటెండ్గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్‌లో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్‌ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్‌ను ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే. ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్లైన్ ద్వారా మన కరిక్యులమ్‌లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్ఎస్సీ, ఎల్బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు. జగన్నాథ రథం.. విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్‌లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్‌తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్‌లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్‌పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు. ఎమ్మెల్యే అనిల్‌ను చూసినప్పుడల్లా.. ఎమ్మెల్యే అనిల్‌ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్‌ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా. పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా? ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట! సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. -
ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహం.. వేలాదిమందికి ఉద్యోగాలు!
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తాజాగా 'నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (NSDC)తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఈ-కామర్స్ సెక్టార్లో మాత్రమే కాకుండా బిజినెస్, రిటైల్, వేర్‌హౌసింగ్ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించడానికి యోచిస్తోంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిష్టర్ 'అతుల్ కుమార్ తివారీ', NSDC COO వేద్ మణి తివారీ పాల్గొన్నారు. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగించాలనుకుని వారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఫ్రీ ఆన్లైన్ కోర్సులను నైపుణ్యాలను పెంచుకుంటే.. ఈ కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను బలపరుస్తూ.. వేర్‌హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది. ఎంఓయూపై సంతకం చేసిన సందర్భంగా ఎన్ఎస్డీసీ డైరెక్టర్ వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పౌరులను ఉద్యోగ నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు ఎన్ఎస్డీసీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఓ ముఖ్యమైన మైలురాయి. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి ఈ-కామర్స్, రిటైల్ అండ్ లాజిస్టిక్స్ రంగాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యం కల్పించడం మా లక్ష్యం. ఉద్యోగార్ధులు వారి ఎంపికకు తగిన ఉద్యోగాన్ని పొందటంలో సహాయపడటానికి మేము ఈ కూటమిని దేశం అంతటా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ 'రజనీష్ కుమార్' మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ ప్రయాణంలో మిలియన్ల కొద్దీ స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, దేశంలో ఆర్థిక వృద్ధి తోడ్పాటుకు కట్టుబడి ఉంది. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో కామర్స్ అండ్ రిటైల్ రంగాలలో నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ఉన్నత విద్యలో మరో చరిత్ర
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ విద్యా రంగ సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు ఇప్పటికే ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. పాఠ్యప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్ను చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి వర్సిటీల్లో ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఉచితంగా రూ.30 వేల విలువైన కోర్సు.. ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పేరొందింది. ఇందులో 180కిపైగా వరల్డ్‌క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2 వేలకు పైగా వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికిపైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్లకు పైగా వెచ్చించనుంది. అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతో పాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ లాంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు. ఉదాహరణకు డిగ్రీ సెమిస్టర్లో ఆరు సబ్జెక్టులు ఉంటే ఒకటి ఎడెక్స్ కోర్సుతో భర్తీ చేస్తారు. ఆయా కళాశాలలు, వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు. ఎడెక్స్ కోర్సు ఇలా.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్‌లో భాగం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో 2, 4వ సెమిస్టర్, ఇంజనీరింగ్‌లో 2, 4వ, 6వ సెమిస్టర్లలో ప్రతి విద్యార్థి వర్సిటీ/కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు మరింత అర్థవంతంగా బోధించేందుకు వీలుంటుంది. విద్యార్థికి నచ్చిన సమయంలో.. విద్యార్థులు ఎడెక్స్ ఆన్లైన్ కోర్సును తమకు అనువైన సమయంలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్‌లో క్లాసులకు హాజరు కావచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్లైన్ సపోర్టింగ్ సిస్టమ్‌లో మెంటార్లు ఉంటారు. తద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయి. ఉదాహరణకు బీకామ్ విద్యార్థులు హార్వర్డ్ వర్సిటీ అందించే సీఎస్ 50 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్, కొలంబియా వర్సిటీ నుంచి ఫ్రీ క్యాస్ ఫ్లో అనాలసిస్, మసాచుసెట్స్ వర్సిటీ నుంచి మేథమెటికల్ మెథడ్స్ ఫర్ క్వాంటిటేటివ్ ఫైనల్స్ లాంటి విభిన్న వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఇలా ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ, ఫార్మా, ఎంబీఏ, వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన విభిన్న, వినూత్న కోర్సులను అభ్యసించవచ్చు. దేశంలో అందుబాటులో లేని విప్లవాత్మక కోర్సులను ఎడెక్స్‌తో ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. తద్వారా వివిధ కోర్సుల్లో స్థానికంగా అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను అధిగమించవచ్చు. మెరుగైన ఉపాధి.. ఎడెక్స్‌తో రెగ్యులర్ కోర్సులు కాకుండా మార్కెట్ ఓరియంటెడ్ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఫైథాన్ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోవలో ఉన్నాయి. వీటిని నేర్చుకోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచాలి. అత్యున్నత విశ్వవిద్యాలయాలు/సంస్థలకు చెందిన అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధించేలా ఎడెక్స్ దోహదం చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. -
ఆన్లైన్ కోర్సులపై పెరుగుతున్న విశ్వాసం
హైదరాబాద్: విద్యార్థుల్లో ఆన్లైన్ కోర్సులు, అభ్యాసం పట్ల విశ్వాసం పెరుగుతూనే (కరోనా అనంతరం) ఉందని ప్రముఖ ఆన్లైన్ శిక్షణా సంస్థ ఫిజిక్స్ వాలా వెల్లడించింది. ఫిజిక్స్ వాలా తన మొబైల్ అప్లికేషన్‌ను వినియోగించే 27 లక్షల మంది విద్యార్థులు, 4 కోట్ల యూట్యూబ్ చందాదారుల వీక్షణ డేటా ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. ఫిజిక్స్ వాలా పెయిడ్ కోర్సుల్లో 2022లో 8.5 లక్షల మంది చేరగా, 2023లో వీరి సంఖ్య 24 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. అంటే ఏడాదిలో 183 శాతం మంది విద్యార్థులు పెరిగారు. ఆన్లైన్ కోర్సులపై పెట్టుబడులు పెట్టడానికి విద్యార్థులు సముఖంగా ఉన్నారనే దానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఫిజిక్స్ వాలా యాప్ డౌన్లోడ్లు సైతం 2022లో 68 లక్షలుగా ఉంటే, 2023లో 94 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023 డిసెంబర్ నాటికి మొత్తం డౌన్లోడ్లు 1.62 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. అందుబాటు ధరలు, నాణ్యమైన కంటెంట్‌ను సానుకూలతలుగా పేర్కొంది. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు ఫిజిక్స్ వాలా ప్రకటించింది. 81 యూట్యూబ్ చానళ్ల ద్వారా తాము లక్షకు పైగా కంటెంట్ పీస్‌లను అప్లోడ్ చేశామని, 20 కోట్ల గంటల పాటు విద్యార్థులు చూశారని వివరించింది. ఇది తమ పెయిడ్ కోర్సుల్లో మరింత మంది విద్యార్థులు చేరేలా దోహదం చేస్తున్నట్టు తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఒక్కో విద్యార్థి రోజువారీ వెచ్చించే సగటు సమయం కూడా 50 నిమిషాల నుంచి 65 నిమిషాలకు పెరిగినట్టు పేర్కొంది. సందేహాలు అడిగి, వాటిని తీర్చుకునే విద్యార్థుల సంఖ్య 2023లో 200 శాతం పెరిగినట్టు తెలిపింది. సంప్రదాయ తరగతి గదుల్లో మాదిరే ఆన్‌లైన్‌లోనూ సందేహాలు అడిగి, తీర్చుకునే విషయంలో విద్యార్థులు సౌకర్యంగా ఉంటున్నట్టు వివరించింది. -
ఆన్లైన్ చదువులపైనే ఆసక్తి
సాక్షి, అమరావతి: ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌మయం. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇందుకు విద్యా రంగం మినహాయింపు కాదు. ముఖ్యంగా కోవిడ్ కల్లోల పరిస్థితుల్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్స్, వెబ్సైట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్కూళ్లు, కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులంతా ఇళ్లకే అతుక్కుపోయారు. దీంతో ఆయా విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధించాయి. అభ్యసనం మొదలుకుని.. పరీక్షల వరకు అన్నీ ఆన్లైన్ వేదికగానే సాగాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ చదువులపై ఆసక్తి చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేరుగా కాలేజీల్లో చదివే అవకాశాల్లేనివారితో పాటు ఉద్యోగాల్లో ఉన్నవారు, అదనపు విద్యార్హతలను సంపాదించుకోవాలనుకొనే వారు ఈ ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతూ అన్ని రంగాల్లోనూ డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తుండడంతో ఆన్లైన్ విద్య అందరికీ మరింత అందుబాటులోకి వచ్చింది. ‘స్వయం’.. వందలాది కోర్సులు.. ఆన్లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఎడ్టెక్ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్’ (స్వయం – https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ కోర్సులకు సంబంధించి ఇదివరకు ఉన్న నిబంధనలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఒకింత సడలించింది. నిర్ణీత ప్రమాణాలతో ఆన్లైన్ కోర్సులను అందించేందుకు పలు సంస్థలకు అనుమతులు కూడా మంజూరు చేస్తోంది. యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. మరోవైపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు) కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులే కాకుండా ఆసక్తి ఉన్న వారెవరైనా ఈ కోర్సులను అభ్యసించేలా చర్యలు చేపట్టాయి. ఆన్లైన్లోనే కాకుండా ఓడీఎల్ విధానంలోనూ.. కరోనాకు ముందు ఆన్లైన్ చదువులవైపు ఆసక్తి చూపినవారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనా తర్వాత వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2021–2022లో ఆన్లైన్ కోర్సుల్లో చేరినవారి సంఖ్య 170 శాతం మేర పెరిగినట్లు యూజీసీ సహా పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) విధానంలోనూ ఆన్లైన్ కోర్సుల్లో చేరుతున్నారు. ఆన్లైన్, ఓడీఎల్ మార్గాల్లో చదువులు కొనసాగిస్తున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఆ మేరకు సంస్థలు కూడా అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్పైనే మోజు.. వివిధ వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులు, వాటిలో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులను అభ్యసించే వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. ఉన్నత విద్య విభాగం సర్వే గణాంకాలు పరిశీలిస్తే.. పురుషుల సంఖ్యలో సగం మంది మహిళలు మాత్రమే ఈ ఆన్లైన్, ఓడీఎల్ కోర్సుల్లో చేరుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేవారిలో ఎక్కువ మంది బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెంట్రల్, స్టేట్, డీమ్డ్, ప్రైవేటు వర్సిటీలు ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఎప్పటికప్పుడు కొత్త సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీలు వంటి జాతీయస్థాయి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఆన్లైన్, ఓడీఎల్ కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులు కూడా వీటిని అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
ఒక్క రోజులో 81కోర్సులు
గంట సేపు స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చోవడమే కష్టం... కానీ 24గంటలు కూర్చొని 81 కోర్సులను పూర్తి చేయడం. ‘ఇంపాజిబుల్!’ అనుకుంటున్నారా. కానీ సాధించి చూపించింది రెహనా షాజహాన్. కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల మహిళ... అత్యధిక ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా అంతర్జాతీయ రికార్డు సాధించింది. రికార్డు కోసం బహ్రైన్ వెళ్లిన రెహనా... ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో.. ఇలా అనేక కంపెనీల నుంచి ఆన్లైన్ సర్టిఫికెట్లు పొందింది. ఉదయం 8 గంటలకు మొదలుపెడితే.. రాత్రి 11 గంటలకల్లా 66 సర్టిఫికెట్లు వచ్చాయి. వరల్డ్‌రికార్డు నెలకొల్పాలంటే ఇంకోగంటలో 9 కోర్సులు పూర్తి చేయాలి. ఒకానొక దశలో వదిలేద్దామా? అనుకుంది. వెంటనే ఆ ఆలోచన విరమించుకుని.. గంటలో తొమ్మిది కోర్సులు పూర్తి చేసింది. సర్టిఫికెట్ రావాలంటే.. ఒక్కో కోర్సులో 70శాతం మార్కులు రావాలి. అన్ని మార్కులూ సాధించింది. దుబయ్‌లోని ఓ కంపెనీ హెచ్ఆర్గా పనిచేస్తున్న రెహనా.. తండ్రి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకోసం ఉద్యోగానికి రిజైన్ చేసి ఇటీవలే ఇండియా వచ్చింది. ఇక్కడా ఖాళీగా లేదు. విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆన్లైన్ కోర్సులెలా చేయాలో గైడ్ చేస్తోంది. ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే... రెహనా వాళ్ల చెల్లి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. సో చెల్లిలా ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలన్నది ఆమె కల. జామియా మిల్లియా ఇస్లామియాలో ఎంకామ్ ఎంట్రన్స్ రాసి... హాఫ్ మార్కుతో అడ్మిషన్ కోల్పోయింది. ఆ యూనివర్సిటీలో చేరాలంటే మరో ఏడాది ఆగాలి. వేస్ట్ చేయడమెందుకని ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా డిస్టెన్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత ఏడాదికే జామియాలో ఎంబీఏ సీటొచ్చింది. ఆ ఏడాది కేరళ నుంచి సీటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి రెహనా. కోవిడ్ టైమ్‌లోనే ఆమె ఎంబీఏ అయిపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్తే... కోవిడ్ టైమ్‌ను ఎలా ఉపయోగించుకున్నావని అడుగుతారు. అప్పుడు గుంపులో ఒకరిగా మిగిలిపోగూడదని.. ఎంబీఏ పూర్తవ్వగానే... ఒక రోజు 24 గంటల్లో 55 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసింది. అదే విషయాన్ని ఆమె పనిచేసిన ఎన్జీవో సీఈఓతో చెబితే... వరల్డ్ రికార్డ్‌కు ఎందుకు ట్రై చేయకూడదని ఓ సలహా ఇచ్చారు. అలా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి ఇలా స్ఫూర్తిగా నిలిచిందన్నమాట! -
ఆన్లైన్ కోర్సులు ప్రారంభించండి
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు సహా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ‘మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు’ (మూక్స్)కింద స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ (స్వయం) ద్వారా రూపకల్పన చేసిన కోర్సుల్లో 40 శాతం ఆన్లైన్లో అందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. విద్యా సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు ఇవి అదనమని తెలిపింది. వీటి అమలుకు చర్యల నివేదికలను కూడా సమర్పించాలని తాజాగా పేర్కొంది. విద్యార్థులు డిజిటల్, ఆన్లైన్ వేదికలుగా చదువులు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం మూక్స్ వేదికను ఏర్పాటు చేసింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్రం ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘స్వయం’ ద్వారా వివిధ ఆన్లైన్ కోర్సులకు రూపకల్పన చేసింది. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు అవి అందిస్తున్న కోర్సులకు అదనంగా ‘స్వయం’ ద్వారా ఆన్లైన్ కోర్సులనూ అందించాలని 2021లోనే సూచించింది. కరోనా సమయంలో కొంతవరకు స్పందన వచ్చినా, ఆ తర్వాత అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. దీంతో ‘స్వయం’ కోర్సుల్లో కనీసం 40 శాతమైనా అందించాలని తాజాగా పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థులు తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందుకోగలుగుతారని భావిస్తోంది. రెగ్యులర్ కోర్సులు చేస్తూనే డ్యూయెల్ డిగ్రీ కింద స్వయం కోర్సులకు అవకాశం కల్పించింది. ఈ కోర్సులకు యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్కును కూడా ఏర్పాటుచేసింది. ఈ కోర్సులు అభ్యసించే వారికి క్రెడిట్ల కేటాయింపుతో పాటు వాటిని వేర్వేరు కోర్సులు అభ్యసించే సంస్థలకు బదలాయించుకొనే వెసులుబాటు కూడా కల్పించింది. పలు విశ్వవిద్యాలయాలు ఇప్పటికే క్రెడిట్ బదిలీ కోసం ‘స్వయం’ కోర్సులను ఆమోదించాయని, మిగిలిన వర్సిటీలు కూడా చర్యలు తీసుకోవాలని యూజీసీ తాజాగా పేర్కొంది. ముందుగా వర్సిటీలు అకడమిక్ కౌన్సిళ్ల నుంచి ఆమోదం పొందాలని పేర్కొంది. క్రెడిట్ల కేటాయింపు, బదిలీని ఆయా విభాగాల హెడ్లు, డీన్లు ఆమోదించాలని తెలిపింది. ఈ ఆన్లైన్ కోర్సుల విధానంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని, ఇలా డిజిటల్, ఆన్లైన్ బోధన వల్ల ప్రమాణాలు మెరుగుపడవని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆన్లైన్ కోర్సుల్లో పర్యవేక్షణ కొరవడుతుందని, విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేమని పేర్కొంటున్నారు. విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇలా ఆన్లైన్ బోధన వైపు వెళ్లడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. -
12 లక్షల మందికి ఉచిత ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడం కోసం కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సుల ద్వారా సాఫ్ట్వేర్, ఇతర ఐటీ ఆధారిత అంశాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ 12 లక్షల మంది విద్యార్థులకు నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ (నీట్) పోర్టల్ ద్వారా ఆర్థిక సాయం అందించనుంది. విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ రంగంలో నైపుణ్యం, నిర్వాహక (అడ్మినిస్ట్రేటివ్) వ్యవహారాలు మొదలైన వాటిలో నైపుణ్యాన్ని సాధించేలా చేయడం ఈ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సుల లక్ష్యంగా కేంద్రం నిర్ణయించింది. కృత్రిమ మేధస్సును (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి ఆయా కోర్సులకు ఎంపిక చేస్తారు. ఎడ్టెక్ కంపెనీల భాగస్వామ్యంతో శిక్షణ ఇందుకోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ద్వారా వివిధ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలతో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోనుంది. అనేక పరిమితుల ఆధారంగా వీటిని కౌన్సిల్ ఎంపిక చేసింది. నీట్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అయిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాదికి సంబంధించి శిక్షణ కోసం ఎంపిక ప్రక్రియ ఇటీవలే ఏఐసీటీఈ ప్రారంభించింది. ఎడ్ టెక్ కంపెనీలు సర్టిఫికేషన్ కోర్సులు, సైకోమెట్రిక్ పరీక్షలు, అసెస్మెంట్ టెస్ట్‌లు, లేబొరేటరీ టూల్స్, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు, కాగ్నిటివ్ స్కిల్స్, మార్కెటింగ్ నైపుణ్యాలు, ప్లేస్మెంట్ సపోర్ట్, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, మేనేజ్మెంట్, అకౌంట్, ఫైనాన్స్ వంటి ఈ–కంటెంట్లను అందిస్తాయి. -
సాఫ్ట్వేర్ కోర్సులపై మహిళ ఆసక్తి, కోర్సెరాలో 48 లక్షల మంది కోచింగ్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం కోర్సెరా ప్లాట్‌ఫాంలో వివిధ కోర్సులు నేర్చుకునేందుకు దేశీయంగా మహిళలు ఆసక్తిగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో తమ ప్లాట్‌ఫాంలో నమోదైన మహిళా లెర్నర్ల సంఖ్య 48 లక్షల పైచిలుకు ఉందని ’మహిళలు, నైపుణ్యాల నివేదిక’లో కోర్సెరా వెల్లడించింది. దీంతో తమ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా మహిళా లెర్నర్ల విషయంలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొంది. దేశీయంగా ఆన్లైన్లో నేర్చుకునేందుకు మరింత మంది మహిళలు ఆసక్తి చూపుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు కోర్సెరా తెలిపింది. 2019లో మొత్తం కొత్త లెర్నర్ల సంఖ్యలో మహిళల వాటా 37 శాతంగా ఉండగా, 2021లో ఇది 44 శాతానికి పెరిగిందని వివరించింది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో.. ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరగ్గా, ఆన్లైన్ లెర్నింగ్‌లో మాత్రం ఇది తగ్గిందని పేర్కొంది. ఉద్యోగాల్లో తిరిగి చేరడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు మహిళలు ఆన్లైన్ బాట పడుతున్నారని కోర్సెరా సీఈవో జెఫ్ మెజియోన్కాల్డా తెలిపారు. 2016లో మొత్తం లెర్నర్ల సంఖ్యలో మహిళల వాటా 24 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 38 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక అంతర్జాతీయంగా మహిళా లెర్నర్ల సగటు వయస్సు 31గా ఉండగా భారత్‌లో ఇది 27గా ఉందని వివరించింది. చాలా మంది ఎక్కువగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులు, ఎంట్రీ స్థాయి ప్రొఫెషనల్ సర్టిఫికెట్లను ఎంచుకుంటున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోర్సెరా ప్లాట్‌ఫాంపై 8.7 కోట్ల మంది యూజర్లు ఉండగా, భారత్‌లో వీరి సంఖ్య 1.25 కోట్లుగా ఉంది. చదవండి: సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్! -
ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ మణిహారం..
అమరావతి: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, తన చరిత్రలో మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఆరంభించింది. రాష్ట్రంలోని విద్యావంతులైన యువతకు డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచి, నైపుణ్య మానవ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్న సంస్థలు, కంపెనీలకు ఒక చిరునామాగా ఏపీని తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య, ఉన్నత విద్యారంగంలో తీసుకొస్తున్ విప్లవాత్మక మార్పులు మైక్రోసాఫ్ట్ సంస్థను ఆకట్టుకుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శుక్రవారం వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, సీఎం కార్యాలయ విదేశీ విద్యావ్యవహారాల అధికారి డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కో ఆర్డినేట్ డాక్టర్ కుమార్ అన్నవరపు, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ముందుకు రావడం ముదావహమన్నారు. రాష్ట్రంలోని విద్యా యువతకు మైక్రోసాఫ్ట్ అందించరే డిజిట్ నైపుణ్య సాధన ఎంతో ఊతమిస్తుందాని, ఈ శిక్షణ పొందడం ద్వారా యువత ఉద్యోగం పొందే అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు. డిజిటల్ కనెక్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ చేరువ కానుందని, దాదాపు 80 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ సంస్థలో జరిగిన ఈ అవగాహన ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు వృత్తి విద్యా కశాళాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందన్నారు. కళాశాలల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ముందగానే మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడం సర్టిఫికెట్ ఇవ్వడం ద్వారా వారు మంచి అవకాశాలు పొందడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని, ఉన్నత విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను యువతకు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ఇప్పడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు జతకలవడం మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు 42 రకాలకు పైగా నైపుణ్య శిక్షణలు ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగై వారు మంచి అవకాలు పొందడానికి ఇది ఊతమిస్తుంది అన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి తాము ఎంతో ఉత్సుకతతో ఉన్నామన్నారు. దేశంలో డిజిటల్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే ఈ డిజిటల్ స్కిల్లింగ్ అనేది ఒక పునాదిలాగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి వారు మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి సహకరించేలా పనిచేయడానికి తాము కంకణబద్ధులైనామని తెలిపారు. ఏపీతో కలిసి పనిచేయడానికి తమకు సహకరించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏమిటీ కోర్సులు మైక్రోసాఫ్ట్ సంస్థ తన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న విప్లవాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వనుంది. సమకాలీన ప్రపంచంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలకు పదునుపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేకించి 42 రకాల కోర్సులను విద్యార్థులకు అందించనుంది. 1.60లక్షల మందికిపైగా ఈ కోర్సులు అందించనున్నారు. మొత్తం 42 రకాల కోర్సులుంటాయి. కోర్సులను బట్టి మొత్తం 40 గంటల నుంచి 160 గంటల వ్యవధి శిక్షణ ఇస్తారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏడు రకాల అజ్యూర్ (Azure DevOps)టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, పవర్ యాప్ ఫండమెంటల్స్, అజ్యూర్ డాటా అనలిటిక్స్, డాటాబేస్ తదితర 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సులు ఇందులో ఉంటాయి. వీటికి మైక్రోసాఫ్ట్ నుంచి సుశిక్షితులైన నిపుణుల ద్వారా ఆన్లైన్, ఆఫ్ లైన్ శిక్షణా తరగతులను అందిస్తారు. అలాగే ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూలకు ఎలా సంసిద్ధం కావాలి, వేష భాషలతో పాటు, నైపుణ్యాలపైనా శిక్షణ ఇస్తారు. ఈ తరగతుల నిర్వహణకు సంబంధించిన స్థానికంగా వనరుల సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థి ప్రొఫైళ్లను లింక్డిన్లో అప్డేట్, అప్లోడు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ నైపుణ్యాలున్న వారికోసం అన్వేషిస్తున్న సంస్థలకు లింక్డిన్ ద్వారా ఈ ప్రొఫైళ్లను పంపి, తద్వారా విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి ఉద్యోగాలు పొందే వీలు కల్పిస్తారు. 75 శాతం ఉద్యోగాలు నైపుణ్యులకే రోజురోజుకీ సాంకేతిక ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. పోటీతత్వం పెరిగిపోతోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ సంస్థలను, పరిశ్రమలను నైపుణ్యమున్న మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల విద్యార్హతలకంటే వారిలోని నైపుణ్యార్హతలకే సంస్థలు పెద్దపీఠవేస్తున్నాయి. సాంకేతిక మానవ వనరుల కొరతైతే మరింత తీవ్రంగా ఉంది. రాబోయే పది సంవత్సరాల్లో సంస్థలు, పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలకు సాంకేతిక నైపుణ్యం ఉన్నవారే అవసరం. ప్రస్తుత అవసరాలకు సరిపడా నైపుణ్యాలున్న మానవ వనరులు కనీసం 50శాతం మంది కూడా లభించడం లేదు. ఇందులోనూ 71 శాతం స్టెమ్ జాబ్స్ అన్నీ కూడా కంప్యూటింగ్ రంగంలోనే ఉన్నాయి. ఈ డిమాండును కేవలం 8శాతం కంప్యూటింగ్ పట్టభద్రులు మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. దీన్ని బట్టీ రంగంలో నైపుణ్యాలున్న అభ్యర్థులకు ఎంతటి డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎంతో మేలు మైక్రోసాఫ్ట్ చేపట్టబోయే ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయి. పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు ముందుండే అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ కల్పించనుంది. కోర్సులు నిర్వహించడమే కాకుండా కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహిస్తారు, అనంతరం విద్యార్థికి మైక్రోసాఫ్ట్ సంస్థ సర్టిఫికెట్ అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ కలిగి ఉండటమనేది ఉద్యోగాలు పొందడానికి ఆ విద్యార్థికి అదనపు అర్హతవుతుంది. ఉద్యోగాలకు నిర్వహించే ఎంపిక ప్రక్రియలో ఈ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు సంస్థలు అత్యధిక ప్రాధాన్యమిస్తాయి. ప్రతి విద్యార్థికీ వంద డాలర్ల బహుమతి ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ మైక్రోసాఫ్ట్ సంస్థ వంద డాలర్ల బహుమతి కూడా అందించనుంది. దానికి సంబంధించి ప్రతి విద్యార్థికీ బహుమతి కూపన్ ఇవ్వనుంది. దీనిద్వారా వారు తమ నైపుణ్యాలను మరింత లోతుగా పదునుపెట్టుకోవడానికి వీటిని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. -
ఆన్లైన్ కోర్సులు: ప్రపంచ రికార్డు
లాక్డౌన్ సమయంలో కొందరు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చారు. కొందరు ఆన్లైన్ గేమ్స్ మీద దృష్టిపెట్టారు. ఇంకొందరు కొత్తరకం వంటకాలు చేస్తూ రుచిని ఆస్వాదించారు. కానీ, కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్ 90 రోజుల్లో 350 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసి, ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆర్తి ఎంఇఎస్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మాలియక్కల్ మేదతిల్ ఎంఆర్ రఘునాథ్, తల్లి కళాదేవి. కోవిడ్–19 సృష్టించిన ఇబ్బందులతో ప్రజలు వివిధ కార్యకలాపాలు చేస్తూ తమ సమయాన్ని గడుపుతుండేవారు. ఆర్తి రఘునాథ్ మాత్రం చదువుకుంటూ కాలం గడిపింది. ఆర్తి కొచ్చిలోని ఏలంకరలో ఉంటుంది. ‘కరోనా కాలంలో మూడు నెలల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచించాను. అప్పుడే నా దృష్టి ఆన్లైన్ కోర్సుల మీద పడింది. ఇందుకు ఆన్లైన్లోనే మా లెక్చరర్ల సలహా తీసుకున్నాను. వారి సూచనలతో ఒక్కో విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పెట్టాను. అలా ఆన్లైన్లోనే 350 కోర్సులు పూర్తి చేశాను. అన్నీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలే. ఇప్పటి వరకు ఇన్ని కోర్సులు చేసినవారు ఎవరూ లేకపోవడంతో నాకు ప్రపంచ రికార్డు దక్కింది’ అని ఆర్తి సంతోషంగా వివరించింది. కోర్సులను ఎలా పూర్తిచేయగలిగిందో ఆర్తి మరింత వివరంగా చెబుతూ ‘ఆన్లైన్ కోర్సులు భారీ స్థాయిలో ఉన్నాయి. అన్నీ అంత సులువుగా ఏమీ అర్థం కాలేదు. ఇలాంటప్పుడు మా కాలేజీ ప్రిన్సిపాల్ పి మహ్మద్, హనిఫా కె జి, క్లాస్ ట్యూటర్ నీలిమా టి కె సహాయంతో కోర్సులను సకాలంలో పూర్తి చేశాను’ అని తెలిపింది. ఆర్తి కోర్సులు తీసుకున్న విశ్వవిద్యాలయాలలో జాన్ హాకిన్స్, వర్జీనియా, కొలరాడో బౌల్డర్, కోపెన్ హాగన్, రోచెస్టర్, ఎమోరీ, కోర్సెరా ప్రాజెక్ట్ నెట్వర్క్, డెన్మార్క్ సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సమయం అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. దానిని ఉపయోగించుకునే వారి తీరును బట్టి కాలం పట్టం కడుతుంది. అలా 90 రోజులలో 350 కోర్సులతో ప్రపంచమంతా ప్రశంసించే విద్యాపట్టం దక్కించుకుంది ఆర్తి. కేరళ లోని అలప్పుజ వాసి 20 ఏళ్ళ సొనాబెల్సన్ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 500 ఫౌండేషన్ కోర్సులను పూర్తిచేసింది. బి.కామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోనా తన గురువు దీపా జయనందన్ సూచనలతో ఈ కోర్సులను పూర్తి చేశానని తెలిపింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 124 విశ్వవిద్యాలయాల నుంచి 500 ఫౌండేషన్ కోర్సులను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నట్టు చెప్పింది. -
‘స్వయం’ సమృద్ధి!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడి విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆన్లైన్ కోర్సులు విద్యార్థులకు అక్కరకు వస్తున్నాయి. పలు కోర్సులను ఇళ్ల నుంచే అభ్యసించి పరీక్షలు రాసేందుకు ఆన్లైన్ వేదికలు దోహదం చేస్తున్నాయి. కోవిడ్–19 కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ‘స్వయం’ ఆన్లైన్ వేదిక ద్వారా ఇప్పటికే పలు ఆన్లైన్ కోర్సులకు అవకాశం కల్పిస్తున్న యూజీసీ మరిన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నిపుణులైన అధ్యాపకుల ద్వారా ఆన్‌లైన్‌కు అనువుగా పాఠ్యాంశాలను రూపొందిస్తారు. ► 2017లో ప్రారంభమైన స్వయం ఆన్లైన్ వేదికలో వివిధ విభాగాలలో ఇప్పటికే 2 వేల కోర్సులు అందుబాటులో ఉండగా 1.6 కోట్ల మంది విద్యార్థులు, ఇతర అభ్యాసకులు ఇందులో నమోదు చేసుకున్నారు. దాదాపు అన్ని విభాగాల్లో ఉచితంగా ఆన్లైన్ కోర్సులను అందిస్తోంది. ► ఈ ఏడాది 574 కోర్సులలో 26.03 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు కావడంతో పాటు యూజీసీ క్రెడిట్లు కేటాయిస్తూ క్రెడిట్ ఫ్రేమ్వర్కు నిబంధనల ప్రకారం బదిలీకి కూడా అవకాశం కల్పించడంతో ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. ► రెగ్యులర్ కోర్సుల ప్రకారం చూస్తే స్వయం ద్వారా మొత్తం కోర్సుల్లో ఒక్కో సెమిస్టర్లో 20 శాతం మేర మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మరో 40 శాతం విస్తరించాలని యూజీసీ నిర్ణయించింది. యూజీ, పీజీ కోర్సులను ఆన్‌లైన్‌లోకి మార్పు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు పాఠ్యాంశాల వీడియోలు, ఈ–మెటీరియల్ రూపకల్పనకు యూజీసీ చర్యలు చేపట్టింది. ► ఈ కోర్సులను అభివృద్ధి చేసేందుకు అర్హులైన అధ్యాపకుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను యూజీసీ ఆహ్వానిస్తోంది. ► యానిమేషన్, వీడియోలు, వర్చువల్ ల్యాబ్‌లు, ఇంటర్వ్యూలు ఇలా వివిధ రూపాల్లో ఈ కోర్సులకు ఆన్లైన్ కంటెంట్ రూపొందిస్తారు. ఆన్లైన్ చర్చా వేదికలు, ప్రశ్నోత్తరాలు, క్విజ్లు, అసైన్మెంట్లు, సందేహాల నివృత్తి తదితర రూపాల్లో ఈ కోర్సులుంటాయి. ► ఒక్కో మాడ్యూల్ వీడియో సుమారు 25–30 నిమిషాల వ్యవధి ఉంటుంది. అవసరమైతే మూడు, నాలుగు వీడియోలుగా రూపొందిస్తారు. ఆన్లైన్లో విద్యార్థులను ఎక్కువ సేపు ఏకాగ్రతతో ఉంచడం కష్టం కాబట్టి సుదీర్ఘ అంశాలను కుదిస్తారు. బోధన ఆకర్షణీయంగా ఉండేందుకు ఆటలు, క్విజ్లు లాంటివి కూడా చేరుస్తారు. ► కోర్సు వ్యవధి సాధారణంగా 8 నుంచి 12 వారాలు ఉంటుంది. ► ఈ కోర్సుల వీడియోలు, ఇతర అంశాలను రూపొందించేందుకు ఆసక్తి చూపే అధ్యాపకులకు పీహెచ్డీ అర్హతతో పాటు గుర్తింపు పొందిన వర్సిటీ, విద్యాసంస్థలో సభ్యుడిగా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఐదేళ్ల బోధనా అనుభవం ఉండాలి. వర్సిటీ అంగీకార లేఖ కూడా సమర్పించాలి. -
షట్లర్లకు ఐఓసీ పరీక్షలు
న్యూఢిల్లీ: ఆటలన్నీ అటకెక్కాయి. లాక్‌డౌనే ముందంజ (పొడిగింపు) వేస్తోంది. స్టేడియాలు మూతపడ్డాయి. రాకెట్స్ ఓ మూలన పడ్డాయి. ఆటగాళ్లు గడపదాటే పరిస్థితి లేదాయే! దీంతో క్రీడల కోటాలో ఉద్యోగాలిచ్చిన సంస్థలు తమ ఆటగాళ్లకు ఆన్లైన్ పరీక్షలు పెడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఖాళీ సమయంలో ఆన్లైన్లో కోర్సు చదివి పరీక్షలు రాయాల్సిందిగా కోరింది. సైబర్ సెక్యూరిటీ, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మెయింటెనెన్స్ తదితర కోర్సులు చదివి (ఆన్లైన్లో) అసెస్మెంట్ పరీక్షలు రాయాలని సూచించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్ కాంస్య పతక విజేత సిక్కి రెడ్డి, సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్, డబుల్స్ ప్లేయర్ చిరాగ్ షెట్టి తదితరులు ఐఓసీ సూచించిన అసెస్మెంట్ టెస్టులు రాసే పనిలో పడ్డారు. దీనిపై తెలుగమ్మాయి సిక్కి రెడ్డి మాట్లాడుతూ ‘మాకు కొన్ని కోర్సులు చదివి ఆన్లైన్లో పరీక్షలు రాయాలని ఐఓసీ మెయిల్ చేసింది. నిజంగా ఈ కోర్సులు చాలా ఆసక్తిగా, ఉపయోగకరంగా ఉన్నాయి. రాకెట్‌తో కసరత్తు, ఫిట్నెస్ కోసం వార్మప్ చేసే నేను ఇప్పుడైతే కోర్సు పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఈ నెల 4న కోర్సు మొదలుపెట్టాను. ఇందులో సుమారు 40 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. కొన్ని 15 నిమిషాల్లో పూర్తయితే మరికొన్నింటికి 45 నిమిషాలు పడుతుంది. ఆ వెంటే పరీక్షలు కూడా రాయాలి. ఇందులో పాస్ కావాలంటే 80 శాతం మార్కులు రావాలి’ అని వివరించింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ మాట్లాడుతూ ‘ఈ కోర్సు మెటీరియల్ చదివి తీరాలన్నంతగా ఆసక్తిగా ఉంది. ఐఓసీ కంపెనీ చేసే ప్రాసెసింగ్‌పై మాకు అవగాహన కల్పించేలా ఉంది. ఇంధన వనరుల ఉత్పాదకత, దీనికోసం తీసుకునే భద్రత చర్యలు, పెట్రోల్ బంకుల నిర్వహణ తీరు తెలిసింది. ఈ కోర్సుల ఆలోచన చాలా మంచి నిర్ణయం. పూర్తిస్థాయి అథ్లెట్లమైన మాకు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల తెలియని విషయాలు నేర్చుకునే వీలు దొరికింది’ అని అన్నాడు. చిరాగ్ షెట్టి కూడా కోర్సులోని పాఠ్యప్రణాళిక, ఆన్లైన్ పరీక్షలు చాలా బాగున్నాయని చెప్పాడు. మహ మ్మారి విలయతాండవంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అన్ని టోర్నీలను జూలై వరకు రద్దు చేసింది. -
అంతర్జాతీయ వర్సిటీల ఉచిత ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొనేందుకు ప్రపంచ శ్రేణి యూనివర్సిటీలు సహా పలు వర్సిటీలు ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, డ్యూక్, మిచిగాన్ సహా అంతర్జాతీయంగా ప్రముఖ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను అందించేందుకు నిర్ణయించాయి. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (మూక్స్) విధానంలో అందించే ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు, క్రెడిట్లు అందిస్తాయి. ఈ క్రెడిట్లకు భవిష్యత్తులో ప్రాధాన్యం కూడా దక్కనుంది. ► స్టాన్ఫోర్డ్, జార్జియాటెక్, యేల్, డ్యూక్, మిచిగాన్ వంటి అనేక వర్సిటీలలొ దాదాపు 178 మూక్స్ సర్టిఫికేషన్ కోర్సులు. ► ఉచితంగా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్న వర్సిటీలు 50. ► వీటిలో పెన్, జార్జియాటెక్, జాన్స్ హాకిన్స్, కాల్టెక్, డ్యూక్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటివి ఉన్నాయి. ► 180 రోజుల్లో పూర్తయ్యేలా ఈ సర్టిఫికేషన్ కోర్సులకు ఈ ఏడాది మే ఆఖరు వరకే అవకాశం ఉంది. ► ఇవే కాకుండా గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఫ్రీ ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ► ఈ కోర్సుల వ్యవధి వారంలో 5 నుంచి 10 గంటలవరకు మాత్రమే ఉంటుంది. ఫ్రీ ఆన్లైన్ కోర్సుల్లో ముఖ్యమైన కేటగిరీలు కంప్యూటర్ సైన్సు; బిజినెస్; ఇంజనీరింగ్; హెల్త్ అండ్ మెడిసిన్; హ్యుమానిటీస్; డేటా సైన్స్; పర్సనల్ డెవలప్మెంట్; ఆర్ట్ అండ్ డిజైన్ ప్రోగ్రామింగ్; మేథమెటిక్స్; సైన్స్; సోషల్ సైన్సెస్. ఈ విభాగాల్లోనూ పలు స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్: ఉచితంగా అందిస్తున్న ఈ కోర్సులకు సంబంధించిన సమాచారాన్ని https://www.classcentral.com/report/coursera-free-certificate-covid-19/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఈ ఉచిత ఆన్లైన్ కోర్సుల అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆ క్రెడిట్లతో ప్రయోజనం పొందగలుగుతారని రాష్ట్ర విదేశీవిద్య కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు పేర్కొన్నారు. విద్యా సమాచారం ఆకాశవాణి ద్వారా ఎంసెట్ శిక్షణ కరోనా వైరస్‌తో లాక్డౌన్ కారణంగా విద్యార్థులు పాఠశాలలకు దూరమై ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో వారికి ఆన్లైన్ విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా సాంఘిక సంక్షేమ, ఇతర సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ఎంసెట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. రోజూ ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా వినవచ్చన్నారు. రేడియో సెట్ లేని విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో ఆల్ ఇండియా రేడియో మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా వినాలని సూచించారు. ఫీజులపై త్వరలో నోటిఫికేషన్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంఎడ్, లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ (ఎల్పీటీ) తదితర కోర్సులకు సంబంధించి 2020–21 నుంచి 2022–23 వరకు మూడేళ్ల కాలపరిమితి ఫీజుల ఖరారుకు సంబందించి త్వరలోనే నోటిఫికేషన్‌ను వెలువరించనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను కమిషన్ పూర్తిచేసిందని వివరించారు. ఈనెల 18 లేదా 19వ తేదీల్లో నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని చెప్పారు. సెట్ల దరఖాస్తు ఫీజు గడువు పెంపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ దరఖాస్తు గడువును పొడిగించినట్లు వివరించారు. ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 7 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. డేటా అప్లోడింగ్ గడువు పెంపు కోవిడ్–19 నేపథ్యంలో రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీల డాక్యుమెంట్లు, ఇతర సమాచారం, అప్లోడింగ్ గడువును కాలేజీల వినతి మేరకు మే 6 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఎంఆర్సీ) కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్లో తెలిపిన మేరకు కోర్సుల వారీగా నిర్ణీత రుసుమును ఏప్రిల్ 24వ తేదీలోగా కాలేజీలు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల సమాచార సమర్పణ గడువు పొడిగింపు రాష్ట్రంలో సాధారణ డిగ్రీ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఆయా కాలేజీలు డాక్యుమెంట్లు, ఇతర సమాచార సమర్పణ తేదీని మే 6 వరకు పొడిగించినట్లు రాజశేఖరరెడ్డి తెలిపారు. కాలేజీలు చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ఏప్రిల్ 24లోగా చెల్లించాలి. -
చదువునూ దాచుకోవచ్చు!
సాక్షి, అమరావతి: బీఏ సెకండియర్‌లో ఉన్న ఓ విద్యార్థికి ఆ చదువు మధ్యలో ఉండగానే మంచి అవకాశాలున్న మరో కోర్సుకు వెళ్లాలనిపించింది.. ఇష్టంలేకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో డిగ్రీలో చేరిన మరో విద్యార్థి అక్కడ చదవలేక తనకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకున్నాడు....వీరిద్దరూ తమకు నచ్చిన మరో కోర్సుకు వెళ్లాలనుకుంటే నిబంధనల ప్రకారం ప్రస్తుతం చదువుతున్న కోర్సులను పూర్తిగా వదులుకోవాల్సిందే. దీనివల్ల వారు చదివిన రెండేళ్లు వృధా అయినట్లే. ఇలా విలువైన సమయాన్ని విద్యార్థులు కోల్పోకుండా కొత్త కోర్సులు చదివేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘నేషనల్ అకడమిక్ క్రెడిట్ (ఎన్ఏసీ) బ్యాంకు’కు శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులు ప్రస్తుత కోర్సులో సాధించిన క్రెడిట్లను దాచుకుని తమకు నచ్చిన ఇతర కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ కొత్త విధానం తోడ్పాటునందిస్తుంది. అంటే.. ఆ కోర్సు పూర్తయ్యాక మళ్లీ పాత కోర్సును పూర్తిచేసేందుకు ఈ విధానం వీలు కల్పించనుంది. ఇలా ఉన్నత విద్యారంగంలో ప్రస్తుత నిబంధనలను విద్యార్థులకు అనుకూలంగా యూజీసీ సరళీకరించనుంది. దీనిపై ఇటీవల నిపుణుల బృందం అందించిన విధానపత్రాన్ని యూజీసీ విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ఏయే కోర్సులు ఈ స్కీం పరిధిలోకి వస్తాయంటే.. యూజీ, పీజీ కోర్సులన్నీ దీని పరిధిలోకి రానున్నాయి. అయితే, ముందుగా పీజీ స్థాయిలో ఈ విధానాన్ని ప్రారంభించి యూజీకి విస్తరింపచేయాలని యూజీసీకి ఇచ్చిన విధాన పత్రంలో నిపుణుల కమిటీ పేర్కొంది. అలాగే, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున ప్రస్తుతానికి వాటికి చేపట్టరాదని సూచించింది. అదే మాదిరిగా ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను కూడా దీని నుంచి మినహాయించింది. క్రెడిట్ల ఆధారంగా విద్యార్థి నుంచి ఎన్ఏసీ బ్యాంకు రుసుము వసూలు చేయనుంది. 20లోగా అభిప్రాయాలు పంపాలి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కొత్త విధానంపై తమ అభిప్రాయాలను ఈనెల 20లోగా ‘nacb. ugc@gmail. com’కు పంపించాలని యూజీసీ పేర్కొంది. బ్యాంకు కార్యకలాపాలు ఇలా.. ►క్రెడిట్ల క్రోడీకరణ ►క్రెడిట్ల బదలాయింపు ►క్రెడిట్లను విముక్తి చేయడం లేదా విడుదల చేయడం ►క్రెడిట్ల ప్రారంభ, ముగింపు నిల్వలను మదింపు చేయడం విద్యార్థులు నచ్చినట్లుగా చదువుకోవచ్చు ►సంప్రదాయ కోర్సుల స్థానే కొత్త కోర్సులను, పాఠ్యాంశాలను రూపొందిస్తున్న నేపథ్యంలో తమకు నచ్చిన కోర్సులు అవసరమైన సమయంలో చదివేందుకు ఈ కొత్త విధానం విద్యార్థులకు స్వేచ్ఛనివ్వనుంది. ►డిజిటల్, ఆన్లైన్, వర్చ్యువల్ కోర్సులతో పాటు వేరే కాలేజీల్లో చేరి ఇతర కోర్సులు చదివేందుకు ఈ కొత్త విధానం అవకాశమిస్తుంది. ►ఒక కోర్సు పూర్తిచేయకుండానే మధ్యలో అంతవరకు సాధించిన క్రెడిట్లను ఎన్ఏసీ బ్యాంకులో దాచుకుని ఇతర కోర్సులో చేరవచ్చు. ఈ బ్యాంకు.. సాధారణ బ్యాంకు మాదిరిగా విద్యార్థులకు డిపాజిట్ అకౌంట్లు ఇస్తుంది. విద్యార్థి కొత్త కోర్సుల్లో సాధించిన క్రెడిట్లు ఈ బ్యాంకు ఖాతాలోకి మళ్లించి క్రెడిట్ ఖాతాను వృద్ధి చేసుకోవచ్చు. ►దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ బ్యాంకులో భాగస్వాములు కానున్నాయి. తద్వారా ఆయా విద్యార్థులకు సంబంధించిన క్రెడిట్ ఖాతాల నిర్వహణ ఒకసంస్థ నుంచి మరో సంస్థకు మారినా ఇబ్బంది లేకుండా కొనసాగింపునకు అవకాశముంటుంది. ►అలాగే, ఎన్ఏసీ బ్యాంకు నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ)కి అనుసంధానమై ఉంటుంది. ►విద్యార్థులు తమ క్రెడిట్లను తిరిగి తీసుకుని తమ పాత కోర్సుల్లో ఇతర సెమిస్టర్లను పూర్తిచేసి కొత్త క్రెడిట్లను దానికి జోడించేందుకు ఆస్కారం కల్పించనున్నారు. ►ప్రాంతాలు, భాషలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో తమకు నచ్చిన సంస్థల్లో నైపుణ్యం కలిగిన గురువుల వద్ద చదువులు కొనసాగించేందుకు వీలు కలుగుతుంది. ►బ్యాంకు ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వదు. -
‘స్వయమ్’లో 2 వేల ఆన్లైన్ కోర్సులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా ‘స్వయమ్’పోర్టల్ ద్వారా 2వేల ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో వారం పాటు జరగనున్న టీచర్ల వర్క్‌షాప్‌ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన స్వయమ్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం 380 కోర్సులకు తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. వీటి ద్వారా దాదాపు 60 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారని చెప్పారు. ఏటీఎం లాగా ఇది విద్యార్థులకు మరో ఏటీఎల్(ఎనీ టైమ్ లెర్నింగ్) అని అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించి తరగతులు నిర్వహిస్తారు. విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది స్వయమ్ పోర్టల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా పాఠశాల స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. -
ఆన్లైన్ కోర్సులకు 100 కోట్ల స్కాలర్షిప్పులు
ముంబై: ఆన్లైన్లో కోర్సులు అభ్యసించే వారి కోసం రూ.100 కోట్ల ఉపకార వేతనాలను అందించనున్నట్లు ఆన్లైన్ విద్యాసంస్థ అప్‌గ్రాడ్ సహ వ్యవస్థాకుడు రోనీ స్క్రూవాలా ప్రకటించారు. కనిష్టంగా రూ. 25,000 నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తామని తెలిపారు. మన దేశానికి ప్రస్తుతం 12.5 కోట్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ల అవసరం ఉందనీ, కాని మూడు కోట్ల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారికి ఆన్లైన్ కోర్సులే సరైన పరిష్కారమని స్క్రూవాలా తెలిపారు. రూ.100 కోట్ల కనీస మూలధనంతో ప్రారంభమైన ఈ స్కాలర్షిప్స్ మొత్తాన్ని వచ్చే 3,4 ఏళ్లలో రూ.400 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ నిధికి తనవంతుగా రూ.10 కోట్లు అందిస్తున్నట్లు స్క్రూవాలా తెలిపారు. -
అందుకో.. ఆన్లైన్ విజ్ఞానం!
మాస్టారు పాఠాలు ఇప్పుడు తరగతి గది నాలుగు గోడలకే పరిమితమవడం లేదు. పాఠశాల విద్యార్థుల ట్యూషన్ క్లాసులు నుంచి స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, బర్క్లీ మొదలైన అంతర్జాతీయ విద్యాసంస్థల కోర్సుల వరకు ఇంటి నుంచే నేర్చుకోవచ్చు. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌తోపాటు సైన్స్, ఇంజనీరింగ్.. ఇలా మరెన్నో విభాగాల్లో స్వల్పకాలిక కోర్సులూ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. పాఠ్యపుస్తకాల రచయితలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పాఠాలను నచ్చిన సమయాల్లో ఎక్కడి నుంచైనా వినొచ్చు. నచ్చిన సబ్జెక్టులో పట్టు పెంచుకోవచ్చు. విద్యార్థి లోకంలో ఈ ఆన్లైన్ కోర్సులు ఇప్పుడు విస్తృత ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి! ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు ఆదరణ పెరుగుతుండడంతో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతోపాటు ప్రముఖ కళాశాలలు సైతం ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చాలా కోర్సులు ఉచితంగానే లభిస్తుండటం గమనార్హం. కోర్సులు అందించే వెబ్సైట్లో లాగినై పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఒక్కో కోర్సుకు ఒక్కో విధమైన కాల వ్యవధి ఉంటోంది. వీటి ద్వారా తరగతి గదిలో అర్థం కాని అంశాలను విద్యార్థి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఉద్యోగస్థులు అదనపు నైపుణ్యాలను సొంతం చేసుకుని పదోన్నతులు పొందొచ్చు. అంతేకాకుండా కోర్సు పూర్తయిన తర్వాత ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ను కూడా అందిస్తున్నాయి. కాబట్టి ఖాళీ సమయాల్లో కొత్త కోర్సు నేర్చుకోవాలనుకునేవారికి ఆన్లైన్ కోర్సులు వరంగా మారాయి. ఎడ్ఎక్స్: హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ), ఐఐటీ-బాంబే, క్యోటో యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు ఎడ్ఎక్స్ ద్వారా 200కుపైగా ఆన్లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తూ విద్యార్థుల విజ్ఞాన దాహం తీరుస్తున్నాయి. లెక్చర్లు, అసైన్మెంట్లు, కోర్సు మెటీరియల్, సంబంధిత వీడియోలు రోజూ 24 గంటలపాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వీలున్నప్పుడల్లా వీటిని నేర్చుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం అసైన్మెంట్లు, పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఆన్లైన్లోనే వీటిని పూర్తిచేయొచ్చు. డిస్కషన్ ఫోరమ్స్, నెట్వర్కింగ్ స్పేసెస్ల ద్వారా ఫ్యాకల్టీ, ఇతర విద్యార్థులతో చర్చించొచ్చు. కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే ఎడ్ఎక్స్ మూడు రకాల సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. అవి.. హానర్ కోడ్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్మెంట్, వెరిఫైడ్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్మెంట్, ఎక్స్ సిరీస్ సర్టిఫికెట్ ఆఫ్ అఛీవ్మెంట్. వెబ్సైట్: www.edx.org కోర్స్ఎరా: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఉచితంగా ఆన్లైన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. సాధారణ విద్యార్థికి సైతం ప్రపంచ స్థాయి విద్యనందించడంలో ‘కోర్స్ఎరా’ వెబ్సైట్ ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇది యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, డ్యూక్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ తదితర ప్రముఖ సంస్థల అధ్యాపకుల శిక్షణలో 700లకు పైగా కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ సైకాలజీ, మొబైల్ అప్లికేషన్స్, స్టార్టప్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, పబ్లిక్ స్పీకింగ్, డేటా అనాలిసిస్ తదితర విభిన్న స్పెషలైజేషన్లలో కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.coursera.org ఎన్పీటీఈఎల్ కోర్సులు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ), ఏడు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ)లు సంయుక్తంగా ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్(ఎన్పీటీఈఎల్) పేరిట ఆన్లైన్లో ఇంజనీరింగ్, సైన్స్ కోర్సులను, సర్టిఫికేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. జూన్ 2014 నాటికి ఎన్‌పీటీఈఎల్‌లో 372 వెబ్కోర్సులతోపాటు 398 వీడియో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా యాక్సెస్ చేయొచ్చు. వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వెబ్సైట్: http://nptel.ac.in/. పోటీ పరీక్షలకూ ప్రత్యేక కోర్సులు! సివిల్ సర్వీసెస్‌తోపాటు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకులు ఇతర పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలూ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా మరికొన్ని నామమాత్రపు ఫీజును వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు http://sakshieducation.com ట్యూషన్లు లభ్యం నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్ వరకు వివిధ తరగతుల ట్యూషన్లు ఆన్లైన్లో ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు అవసరమైన పాఠ్యాంశాలు వీటిలో లభిస్తాయి. మ్యూజిక్, ఆర్ట్ ట్యూష న్లూ ఉన్నాయి. ఫీజులు సైట్లను బట్టి వేర్వేరుగా ఉంటాయి. తక్కువ ఫీజు ఉన్న వెబ్‌సైట్‌ను ఎంచుకోవడం కంటే నాణ్యమైన ట్యూషన్లను ఆఫర్ చేస్తున్న సైట్‌ను ఎంచుకోవాలి. ఉచిత ట్రయల్ సర్వీస్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. సమయం, శ్రమ ఆదా! శ్రీ ఆన్లైన్ కోర్సులు ఎవరికైనా, ఎక్కడి నుంచైనా నేర్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నత విద్యను కొనసాగించాలంటే... రోజుకు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి వారు ఆన్లైన్ కోర్సులను ఎంచుకుంటున్నారు. తమకు నచ్చిన సమయంలో ఉదయం వేళలోనో, సాయంత్రం సమయంలోనో ఈ కోర్సులను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల అవసరాలకనుగుణంగా ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిపుణులైన అధ్యాపకులు ఇంటి వద్ద నుంచే తమ జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకోవాలనుకుంటున్నారు. నామమాత్రపు ఫీజులతోనే వారు పాఠాలు బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నిపుణులైన అధ్యాపకుల లేమి సమస్య ఎదురవుతుంటోంది. వారు ఆన్లైన్ కోర్సులను ఉపయోగించుకుని ప్రయోజనం పొందొచ్చు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కంప్యూటర్, లాప్టాప్లే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్, టాబ్లెట్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సులను నేర్చుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి ప్రయాణంలోనూ ఈ కోర్సులను చూడొచ్చు. అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉండటం ఆన్లైన్ కోర్సుల ప్రత్యేకత. పాఠశాల స్థాయిలో రాష్ట్ర సిలబస్లతోపాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ట్యూషన్లు సైతం ఆన్లైన్లో లభిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలతోపాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులూ ఆన్లైన్లో ఉన్నాయి ్ణ -షర్మిళామురళి, కో-ఫౌండర్, మేనేజింగ్ డెరైక్టర్, www.etuitions.org -
ఆన్లైన్లో ఎంబీఏ కోర్సులు
అన్నానగర్, న్యూస్‌లైన్: చెన్నైకు చెందిన ప్రముఖ మేనేజ్మెంట్ స్కూల్ గ్రేట్‌లెక్స్ ప్రముఖ విదేశీ బిజినెస్ స్కూల్ అయిన మై బి స్కూల్ డాట్ కాంతో కలసి విద్యార్థులకు మాస్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులను మూక్స్ ప్రారంభిస్తోందని గ్రేట్‌లేక్స్ సంస్థ వ్యవస్థాపక డీన్ డాక్టర్ వి.బాలా బాలచంద్రన్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పంద వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎంబీఏ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఈ ఆన్లైన్ మూక్స్ కోర్సులు ఒక వరం లాంటివన్నారు. 25 సబ్జెక్టుల్లో వీటిని బోధిస్తామన్నారు. మొత్తం 500 గంటల సేపు బోధనా తరగతులుంటాయన్నారు. ఆన్లైన్లో వీడియో లెక్చరర్లు కూడా ఉంటారన్నారు. దేశ, విదేశాలకు చెందిన మేనేజ్మెంట్ గురువులు ఆన్లైన్లో తరగతులను బోధిస్తారన్నారు. తాము ఉచితంగా బోధించే 25 మేనేజ్మెంట్లు సబ్జెక్టులు ఒక్కొక్కటి 20 గంటల నిడివిని కలిగి ఉంటాయని గ్రేట్‌లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రొఫసర్ శ్రీరాం తెలిపారు. ఈ కోర్సులన్నీ ఆన్లైన్లో ఉచితంగా బోధిస్తున్నామని, వీటికి విద్యార్థులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదన్నారు. అదే విధంగా ఈ కోర్సులు పూర్తి అయిన తరువాత ఎటువంటి పరీక్షలూ, సర్టిఫికెట్లను ప్రదానం చేయడం వంటి ఫార్మాలిటీలుండవన్నారు. సర్టిఫికెట్లు పొందగోరే వారు ఫీజులను తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఫీజు చెల్లించిన వారికే తాము పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు www.mybskoo .com లో సంప్రదించాలన్నారు.