ఆన్‌లైన్‌ కోర్సులకు 100 కోట్ల స్కాలర్‌షిప్పులు | Ronnie Screwvala to set up Rs100 crore fund for online scholarships | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కోర్సులకు 100 కోట్ల స్కాలర్‌షిప్పులు

Published Mon, Apr 24 2017 8:30 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Ronnie Screwvala to set up Rs100 crore fund for online scholarships

ముంబై: ఆన్‌లైన్‌లో కోర్సులు అభ్యసించే వారి కోసం రూ.100 కోట్ల ఉపకార వేతనాలను అందించనున్నట్లు ఆన్‌లైన్‌ విద్యాసంస్థ అప్‌గ్రాడ్‌ సహ వ్యవస్థాకుడు రోనీ స్క్రూవాలా ప్రకటించారు. కనిష్టంగా రూ. 25,000 నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తామని  తెలిపారు. 

మన దేశానికి ప్రస్తుతం 12.5 కోట్ల పోస్ట్‌ గ్రాడ్యుయేట్ల అవసరం ఉందనీ, కాని మూడు కోట్ల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారికి ఆన్‌లైన్‌ కోర్సులే సరైన పరిష్కారమని స్క్రూవాలా తెలిపారు. రూ.100 కోట్ల కనీస మూలధనంతో ప్రారంభమైన ఈ స్కాలర్‌షిప్స్‌ మొత్తాన్ని వచ్చే 3,4 ఏళ్లలో రూ.400 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ నిధికి తనవంతుగా రూ.10 కోట్లు అందిస్తున్నట్లు స్క్రూవాలా తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement