Ronnie Screwvala
-
టెన్నిస్ ఆడతా!
‘సాహో’ సినిమాతో సౌత్ ఇండియాకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రద్ధాకపూర్. మొన్నామధ్య ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్న విషయం తెలిసిందే. ‘సైనా’లో ఇప్పుడు పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? అనే ప్రశ్నను శ్రద్ధాకపూర్ ముందు ఉంచితే... ‘‘నా జీవితంలో నేను దేని గురించీ రిగ్రెట్ ఫీలవ్వను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. దురదృష్టవశాత్తు ‘సైనా’ ఫస్ట్ డే షూటింగ్‌లోనే నేను అనారోగ్యానికి గురయ్యాను. దాంతో షూటింగ్ కాస్త వాయిదా పడింది. ఆ లోపు ‘ఏబీసీడీ 3’లో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. ‘ఏబీసీడీ 2’ సినిమా నా కెరీర్లో మంచి హిట్. అలాంటప్పుడు ‘ఏబీసీడీ 3’ సినిమాకు నో చెప్పాలనుకోలేదు. అప్పటికే నేను ‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాలతో బిజీగా ఉన్నా. అందుకే ‘సైనా’ చిత్రానికి తిరిగి డేట్స్ కేటాయించలేకపోయాను. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ చేజారింది’’ అని చెప్పారు. ఒక బయోపిక్‌ని మిస్సయిన మీకు ఇప్పుడు ఎవరి బయోపిక్‌లో అయినా నటించాలని ఉందా? అనే ప్రశ్నను శ్రద్ధా ముందు ఉంచితే – ‘‘సానియా మీర్జా (ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి) బయోపిక్ ఆలోచన ఉంది. ఆమెది గ్రేట్ జర్నీ. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. రోనీ స్క్రూవాలా దగ్గర సానియా మీర్జా బయోపిక్ హక్కులు ఉన్న సంగతి తెలిసిందే. మరి.. శ్రద్ధాని రోనీ నాయికగా తీసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. -
ఐ యామ్ అవినాష్
అవినాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐదంకెల జీతం. వీకెండ్ పార్టీలు, పబ్‌లు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో అవుటింగ్‌లు. పుల్ బిందాస్ లైఫ్. ఎప్పుడూ ఒకేలా ఉంటే అది లైఫ్ ఎందుకవుతుంది? సడన్‌గా లైఫ్‌లో బిగ్ టర్న్. అంతే ఆల్ చేంజ్. జాబ్‌లోనే కాదు అతని లైఫ్‌లో కూడా. హిందీ చిత్రం ‘కర్వాన్’ స్టోరీ లైన్ ఇదేనట. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, కృతి కర్భందా, మిథిలా పాల్కర్, రోనీ స్క్రూవాలా ముఖ్య తారలుగా ఆకాశ్ ఖురానా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతోనే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘‘ఇర్ఫాన్ ఖాన్, రోనీ స్క్రూవాలాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమా జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్ డే నుంచి షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంత మంచి టీమ్, ఇలాంటి మంచి సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దుల్కర్ సల్మాన్. రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందట. అది సరే.. ఇంతకీ అవినాష్ ఎవరో చెప్పలేదు కదూ. తెలుగులో అయితే.. అఖిల్ గుర్తుకు రావొచ్చు. ‘హలో’లో తను చేసిన పాత్ర పేరది. బట్... ‘కర్వాన్’లో మై నేమ్ ఈజ్ అవినాష్ అంటున్నారు దుల్కర్ సల్మాన్. -
పెళ్లి తరువాత బాలీవుడ్ ఎంట్రీ
సినీ రంగంలో పెళ్లి తరువాత హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టే అని భావిస్తున్నారు. కానీ అందరి విషయంలో అలా జరగదు. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ లాంటి తారలు పెళ్లి తరువాత కూడా గ్లామర్ రోల్స్ లో ఆకట్టుకుంటున్నారు. అయితే సౌత్ లో అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ. దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అంతేకాదు ఇప్పటి వరకు దక్షిణాది ప్రేక్షకులను మాత్రమే అలరించిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సామ్. ప్రస్తుతం రాజుగారి గది 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ నెల 6న నాగచైతన్యను పెళ్లాడనున్న ఈ భామ, తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి షూటింగ్ లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. -
ఆన్లైన్ కోర్సులకు 100 కోట్ల స్కాలర్షిప్పులు
ముంబై: ఆన్లైన్లో కోర్సులు అభ్యసించే వారి కోసం రూ.100 కోట్ల ఉపకార వేతనాలను అందించనున్నట్లు ఆన్లైన్ విద్యాసంస్థ అప్‌గ్రాడ్ సహ వ్యవస్థాకుడు రోనీ స్క్రూవాలా ప్రకటించారు. కనిష్టంగా రూ. 25,000 నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తామని తెలిపారు. మన దేశానికి ప్రస్తుతం 12.5 కోట్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ల అవసరం ఉందనీ, కాని మూడు కోట్ల మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి వారికి ఆన్లైన్ కోర్సులే సరైన పరిష్కారమని స్క్రూవాలా తెలిపారు. రూ.100 కోట్ల కనీస మూలధనంతో ప్రారంభమైన ఈ స్కాలర్షిప్స్ మొత్తాన్ని వచ్చే 3,4 ఏళ్లలో రూ.400 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ నిధికి తనవంతుగా రూ.10 కోట్లు అందిస్తున్నట్లు స్క్రూవాలా తెలిపారు. -
రోనీ, డానీ @ 63
ఈ అవిభక్త కవలల పేర్లు రోనీ, డానీ. వయసు 62 సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అవిభక్త కవలల్లో వీరే పెద్ద. థాయ్ ట్విన్స్.. చాంగ్, ఎంగ్ బంకర్లు 62 ఏళ్ల ఎనిమిది నెలల ఆరు రోజులు జీవించారు. దీంతో వారిద్దరి వయసును రోనీ, డానీలు అధిగమించారు. మరో నాలుగు నెలల్లో ఇంకో అరుదైన రికార్డును కూడా వీరు సొంతం చేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన అవిభక్త కవలలుగా గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు.. 1877లో ఇటలీలో జన్మించిన గియాకోమో, గియోవాన్ని బట్టిస్టా టోక్కిల పేరిట ఉండేది. వారు 63 ఏళ్ల వయసులో 1940లో కన్నుమూశారు. అమెరికాలోని ఒహియోకు చెందిన రోనీ, డానీలు 1951 అక్టోబర్ 28న జన్మించారు. ఒకరికి ఎదురుగా మరొకరు ఉన్నట్టుగా అతుక్కుని పుట్టిన వీరిద్దరికీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు వేర్వేరు గుండెలు, ఉదరాలు ఉన్నాయి. అయితే జీర్ణకోశం, పురీషనాళం, పురుషాంగం మాత్రం ఒక్కోటే ఉంది. వీటిపై డానీకే నియంత్రణ ఉంటుంది. జన్మించినప్పుడు వీరిద్దరూ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం కోసం డాక్టర్లు ఇద్దరినీ రెండేళ్లపాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ఆపరేషన్ చేస్తే ఇద్దరూ బతుకుతారని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో రోనీ, డానీల తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి ఇలా కలిసే పెరిగారు. నాలుగేళ్ల ప్రాయం నుంచే సంపాదనలో కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. తమకంటే 11 ఏళ్లు చిన్నవాడైన సోదరుడు జిమ్‌తో కలిసి సర్కస్‌లో మేజిక్ ట్రిక్స్ ప్రదర్శిస్తుంటారు. 39 ఏళ్ల వయసులో 1991లో తమ ఉద్యోగాల నుంచి రిటైరయ్యారు. ప్రస్తుతం జిమ్, ఆయన భార్య హాల్వేస్ వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. -
దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ
ముంబై: దాతృత్వంలో బిల్‌గేట్స్ అంతటి స్థాయిలో కాకపోయినా దేశీ కార్పొరేట్లు కూడా వందలు, వేల కోట్ల రూపాయల విరాళాలిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రూ. 8వేల కోట్లు విరాళమిచ్చి ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉండగా.. మన తెలుగువారైన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎంరావు రూ. 740 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన హురున్ రిపోర్ట్ 2013కి సంబంధించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఏడాది కాలంలో అజీం ప్రేమ్‌జీ రూ.8,000 కోట్లు విరాళమిచ్చారు. హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్మన్ శివ నాడార్ రూ.3,000 కోట్లతో రెండో స్థానంలో నిల్చారు. వెనుకబడిన బాలల విద్యాభ్యాసానికి తోడ్పాటం దించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జీఎం రావు రూ.740 కోట్లు విరాళమిచ్చా రు. రూ. 530 కోట్ల విరాళంతో నందన్ నీలేకని, రోహిణి నీలేకని దంపతులు 4వ స్థానంలో ఉండగా, స్వదేశ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.470 కోట్లు వెచ్చించి రోనీ స్క్రూవాలా అయిదో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చ్ 31లోగా రూ. 10 కోట్లకు మించి నగదు, తత్సమాన విరాళాలు ఇచ్చిన 31 మంది భారతీయులతో హురున్ ఇండియా ఈ జాబితా రూపొందించింది.