దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ | Azim Premji tops in philanthropy with Rs 8,000 cr, Ronnie Screwvala in list with Rs 470 cr in donations | Sakshi
Sakshi News home page

దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ

Published Thu, Nov 14 2013 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ

దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ

ముంబై: దాతృత్వంలో బిల్‌గేట్స్ అంతటి స్థాయిలో కాకపోయినా దేశీ కార్పొరేట్లు కూడా వందలు, వేల కోట్ల రూపాయల విరాళాలిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రూ. 8వేల కోట్లు విరాళమిచ్చి ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉండగా.. మన తెలుగువారైన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎంరావు రూ. 740 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన హురున్ రిపోర్ట్ 2013కి సంబంధించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఏడాది కాలంలో అజీం ప్రేమ్‌జీ రూ.8,000 కోట్లు విరాళమిచ్చారు.
 
 హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్మన్ శివ నాడార్ రూ.3,000 కోట్లతో రెండో స్థానంలో నిల్చారు. వెనుకబడిన బాలల విద్యాభ్యాసానికి తోడ్పాటం దించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జీఎం రావు రూ.740 కోట్లు విరాళమిచ్చా రు. రూ. 530 కోట్ల విరాళంతో నందన్ నీలేకని, రోహిణి నీలేకని దంపతులు 4వ స్థానంలో ఉండగా, స్వదేశ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.470 కోట్లు వెచ్చించి రోనీ స్క్రూవాలా అయిదో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చ్ 31లోగా రూ. 10 కోట్లకు మించి నగదు, తత్సమాన విరాళాలు ఇచ్చిన 31 మంది భారతీయులతో హురున్ ఇండియా ఈ జాబితా రూపొందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement