Azim Premji Philanthropy
-
ఒకపుడు కాలేజీ డ్రాపవుట్, మరిపుడు రోజుకు రూ. 27 కోట్లు దానం
సాక్షి,ముంబై: టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు, అజీమ్ ప్రేమ్‌జీ జూలై 24న తన 77వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు, ఆసియాలోని అగ్రశ్రేణి దాతృత్వవేత్తలలో ఒకరుగా పేరుగాంచిన అజీం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కూరగాయల ఉత్పత్తులు, ప్రధానంగా కూరగాయల నూనె కంపెనీగా ప్రారంభమైంది విప్రో ప్రస్థానం. 1966లో తన తండ్రి మరణించిన తర్వాత ప్రేమ్‌జీ కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టారు. కాలేజీ డ్రాపౌట్ నుంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలలో విప్రో లిమిటెడ్‌ను చైర్మన్‌గా మారడం దాకా, అజీమ్ ప్రేమ్‌జీ వ్యవస్థాపక ప్రయాణం స్ఫూర్తిదాయకం. జూలై 24, 1945న ముంబైలో పుట్టిన అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ తన కుటుంబ వ్యాపారాన్ని (వనస్పతి నూనెను ఉత్పత్తి చేసే కంపెనీ) ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ పరిశ్రమలలో ఒకటిగా మార్చిన ఘనత సొంతం చేసుకున్నారు. కాలేజీ డ్రాపవుట్: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదువుతుండగా, తండ్రి మహమ్మద్ హషీమ్ ప్రేమ్‌జీ మరణించడంతో చదువుకు స్వస్తి చెప్పి 1966లో వ్యాపార బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ప్రేమ్‌జీ వయసు కేవలం 21 ఏళ్లే పాకిస్థాన్ ఆహ్వానం తిరస్కరణ: 1947లో ఇండియా-పాకిస్థాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్ నేత మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్‌కు మారమని ప్రేమ్‌జీ తండ్రికి ఆహ్వానం పంపారట. అయితే అందుకు నిరాకరించిన ముహమ్మద్ ప్రేమ్‌జీ దేశంలోనే ఉండాలని నిర్ణయించు కున్నారు. ప్రేమ్‌జీకి ఎప్పుడూ విలాసాల పట్ల మోజు లేదు. ఖరీదైన కార్లు అంతకన్నా లేవు. ఇప్పటికీ ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణాన్ని ఇష్ట పడతారట. వ్యాపార పర్యటనల సమయంలో కంపెనీ గెస్ట్ హౌస్‌లకే ప్రాధాన్యం. అంతేకాదు కంపెనీ క్యాంటీన్ ఆహారాన్నే ప్రిఫర్ చేసేవారు. విప్రో ఆవిర్బావం 1979లో ఐబీఎం ఇండియానుంచి నిష్క్రమించిన తర్వాత ఐటీ రంగంలోకి ప్రవేశించింది విప్రో. అనంతరం బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాలతో టాప్ కంపెనీగా ఎదిగింది. తన తాత 'నిజాయితీ' సూత్రమే తన విజయానికి కారణమని అజీమ్ ఎపుడూ చెబుతూ ఉంటారు. 30 ఏళ్ల తరువాత డిగ్రీ పూర్తి చేసిన అజీంజీ స్టాన్‌ఫోర్డ్‌లో గ్రాడ్యుయేషన్ వదిలిపెట్టిన ఆయన డిస్టెంట్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా 30 ఏళ్ల తర్వాత డిగ్రీ పూర్తి చేయడం విశేషం. కాగా 2021నాటి లెక్కల ప్రకారం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సామాజిక ప్రయోజనాల కోసం 1.3 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. జీవితంలో మొత్తం దాదాపు 10వేల కోట్లను దానం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2021లో కూడా ప్రేమ్‌జీ రూ.9,713 కోట్ల విలువైన విరాళాలతో అగ్రస్థానాన్ని నిలిచారు. అంటే రోజుకు 27 కోట్ల మేర దానం చేశారు. పద్మ పురస్కారాలు విప్రో 75 ఏళ్ల వ్యాపార ప్రయాణం గురించి రాసిన ‘ద స్టోరీ ఆఫ్ విప్రో’ (The Story of Wipro)’పుస్తకాన్ని అజీమ్ ప్రేమ్‌జీ గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. అజీమ్ ప్రేమ్‌జీ యాస్మీన్ ప్రేమ్‌జీని వివాహం చేసుకోగా, ఇద్దరుపిల్లు రిషద్ ప్రేమ్‌జీ , తారిఖ్ ప్రేమ్‌జీ ఉన్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషికిగాను అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. 2005లో "పద్మ భూషణ్ అవార్డు", 2011లో, "పద్మ విభూషణ్" లభించింది. ఇది కూడా చదవండి: ITR Filling Benefits: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్ ఫైలింగ్ లాభాలు తెలుసా? -
దాతృత్వంలో దేశంలోనే అజీమ్ ప్రేమ్‌జీ టాప్
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాన, ధర్మాల్లో ఎప్పుడూ ముందుంటారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో విరివిగా దానాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2021 ప్రకారం రోజుకు సగటున రూ.27 కోట్లతో ఏడాదికి రూ.9,713 కోట్లు చొప్పున విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం దాతృత్వంతో హురున్ ఇండియా, ఎడెల్గైవ్ ఇండియా దాతృత్వ జాబితా- 2021లో అజీమ్ ప్రేమ్‌జీ ముందు వరుసలో నిలిచారు. ప్రేమ్ జీ తన విరాళాలను గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వరకు పెంచారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఈ మహమ్మారి అరికట్టడం కోసం విరాళాలను రెట్టింపు చేసింది హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్‌నాడార్ ₹1,263 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ₹577 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. తర్వాత వరుస స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ₹377 కోట్ల సహకారంతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ ఏడాది జాబితాలో ₹183 కోట్ల విలువైన మొత్తం విరాళాలతో ఐదవ స్థానానికి చేరుకున్నారు. ఇక హిందూజా కుటుంబం ₹166 కోట్ల విరాళాలతో జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు. ₹50 కోట్ల విరాళంతో మొదటిసారి ఇన్వెస్టర్ రాకేష్ ఝుంఝున్ వాలా ఈ దాతృత్వ జాబితాలోకి ప్రవేశించారు. (చదవండి: బంపర్ ఆఫర్..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!) వాతావరణ మార్పుల పరిష్కారాల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు మద్దతు తెలపడానికి సిరోధా సహ వ్యవస్థాపకులు నిథిన్ & నిఖిల్ కామత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ₹750 కోట్లు ఇవ్వనున్నారు. ఈ జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు. 35 ఏళ్ల నిఖిల్ నిఖిల్ కామత్ ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఈ ఏడాది తొమ్మిది మంది మహిళలు పాల్గొన్నారు. రోహిణి నీలేకని దాతృత్వాల కోసం ₹ 69 కోట్లు విరాళం ఇచ్చారు. (చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించిన ఉబర్..!) -
దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ
ముంబై: దాతృత్వంలో బిల్‌గేట్స్ అంతటి స్థాయిలో కాకపోయినా దేశీ కార్పొరేట్లు కూడా వందలు, వేల కోట్ల రూపాయల విరాళాలిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రూ. 8వేల కోట్లు విరాళమిచ్చి ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉండగా.. మన తెలుగువారైన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎంరావు రూ. 740 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన హురున్ రిపోర్ట్ 2013కి సంబంధించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఏడాది కాలంలో అజీం ప్రేమ్‌జీ రూ.8,000 కోట్లు విరాళమిచ్చారు. హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్మన్ శివ నాడార్ రూ.3,000 కోట్లతో రెండో స్థానంలో నిల్చారు. వెనుకబడిన బాలల విద్యాభ్యాసానికి తోడ్పాటం దించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జీఎం రావు రూ.740 కోట్లు విరాళమిచ్చా రు. రూ. 530 కోట్ల విరాళంతో నందన్ నీలేకని, రోహిణి నీలేకని దంపతులు 4వ స్థానంలో ఉండగా, స్వదేశ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.470 కోట్లు వెచ్చించి రోనీ స్క్రూవాలా అయిదో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చ్ 31లోగా రూ. 10 కోట్లకు మించి నగదు, తత్సమాన విరాళాలు ఇచ్చిన 31 మంది భారతీయులతో హురున్ ఇండియా ఈ జాబితా రూపొందించింది.