హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను సడలించడం, వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలను పెంచడంపై దృష్టి సారించడంతో ఫ్రెషర్ల నియామకంపై సానుకూల ప్రభావం చూపుతోందని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. 661 చిన్న, మధ్య, భారీ కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘ప్రస్తుత త్రైమాసికంలో ఫ్రెషర్లను నియమించే ఉద్దేశం 7 శాతం పెరిగింది. జూనియర్ స్థాయి సిబ్బందిని చేర్చుకునే అంశం కూడా సానుకూల పథంలో ఉంది.
జూలై–సెప్టెంబరులో పెద్ద ఎత్తున నియామకాలు ఉండే అవకాశం ఉంది. చాలా పరిశ్రమలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని అధిగమించి, వృద్ధి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు, ఈ–వే బిల్లులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, విద్యుత్ డిమాండ్, రైళ్ల ద్వారా సరుకు రవాణా, పెట్రోల్ వినియోగం వంటివి సెకండ్ వేవ్ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించాయని సూచిస్తున్నాయి. ఈ అంశాలతో నియామక సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది’ అని వివరించింది. ప్రధానంగా ఐటీ రంగంలో నియామకాల జోరు ఉంటుందని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment