
గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్).. గేట్-2016 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్).. గేట్-2016 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. కెమికల్ (ఖాళీలు)-14, మెకానికల్ (ఖాళీలు)-13, ఎలక్ట్రికల్(ఖాళీలు)-13, ఇన్‌స్ట్రుమెంటేషన్ (ఖాళీలు)-06, బీఐఎస్(ఖాళీలు)-11, టెలికం/టెలిమెట్రీ (ఖాళీలు)-10. సంబంధిత విభాగంలో 60/65 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంసీఏ పూర్తి చేసినవారు అర్హులు. గేట్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 1. వివరాలకు www.gailonline.com చూడొచ్చు.
ఎస్వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో అధ్యాపకులు
స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్‌చ (ఎస్వీఎన్‌ఐఆర్‌టీఏఆర్)-కటక్.. ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్‌లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఖాళీల వివరాలు.. డెరైక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అకౌంటెంట్లు. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను ‘ద డైరక్టర్, స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్‌చ, ఓలాత్‌పూర్, బైరోయ్(పోస్ట్), కటక్, ఒడిశా-754010’ కు పంపాలి. చివరి తేది సెప్టెంబర్ 30. వివరాలకు http://svnirtar.nic.in/ చూడొచ్చు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులు
దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్‌లలోని 135 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్).. దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు.. పీజీటీ, టీజీటీ, పీఆర్టీలు. ఎంపికలో భాగంగా ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటితోపాటు టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. పీజీటీలకు పీజీ, బీఈడీ; టీజీటీ, పీఆర్‌టీలకు గ్రాడ్యుయేషన్, బీఈడీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 27. వివరాలకు http://aps-csb.in చూడొచ్చు.
బీహెచ్‌ఈఎల్‌లో ఫిట్టర్, వెల్డర్
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)-తిరుచిరాపల్లి.. ఫిట్టర్ (ఖాళీలు)-150, వెల్డర్ (ఖాళీలు)-50 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెట్రిక్యులేషన్/టెన్‌తతోపాటు ఫిట్టర్, వెల్డర్‌లలో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికేట్(ఎన్‌ఏసీ) కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 30. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వివరాలకు లో చూడొచ్చు.
ఇస్రోలో డ్రైవర్‌లు
ఇండియన్ స్పేస్ రీసెర్‌చ ఆర్గనైజేషన్ (ఇస్రో) డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైట్ వెహికల్ డ్రైవర్లు(ఖాళీలు)-69, హెవీ వెహికల్ డ్రైవర్లు(ఖాళీలు)-40, స్టాఫ్ కారు డ్రైవర్లు-03. శ్రీహరికోట కేంద్రంలో రెండు విభాగాలు కలిపి 30 ఖాళీలున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు లెసైన్‌స ఉన్నవారు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 24. వివరాలకు www.isro.gov.in చూడొచ్చు.