సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్తంగా ఎస్‌ఎమ్ కేర్, హాలో లాంగ్వేజ్ సంస్థలతో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ వివరించారు.
ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్‌ఎం కేర్ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్‌లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment