ఉద్యోగ అవకాశాలు | job opportunities in bokaro steel plant | Sakshi
Sakshi News home page

ఉద్యోగ అవకాశాలు

Published Sun, Nov 29 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

ఉద్యోగ అవకాశాలు

ఉద్యోగ అవకాశాలు

బొకారో స్టీల్ ప్లాంట్‌లో నర్స్ పోస్టులు
సెయిల్‌కు చెందిన బొకారో స్టీల్‌ప్లాంట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 30. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు  www.sailcareers.com చూడొచ్చు.

 
సాయ్‌లో రీసెర్చ్ ఫెలో
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 89. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.sportsauthorityofindia.nic.in చూడొచ్చు.     

ఎయిర్ ఇండియాలో మహిళా సిబ్బంది
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్ ).. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈస్టర్న్ రీజియన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో  మహిళా భద్రతా సిబ్బంది (ఫీమేల్ సెక్యూరిటీ ఏజెంట్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 26. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 13. వివరాలకు  www.airindia.in/careers.htm చూడొచ్చు.
 
 ఐఐడ బ్ల్యూబీఆర్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్/జేఆర్‌ఎఫ్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ (ఐఐడబ్ల్యూబీఆర్).. వివిధ ప్రాజెక్ట్‌లలో జూనియర్ రీసెర్చ్ ఫెలో, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, టెక్నికల్ హెల్పర్ పోస్టుల భర్తీకి డిసెంబర్ 7, 8న ఇంటర్వ్యూలు నిర్వహించ నుంది. మొత్తం ఖాళీలు-9. వివరాలకు www.dwr.res.in చూడొచ్చు.
 
సీఎస్‌ఐఆర్ అనుబంధ సంస్థలో సైంటిస్ట్ పోస్టులు
సీఎస్‌ఐఆర్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ.. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.igib.res.in చూడొచ్చు.
 
ఐఐటీ-మండిలో నాన్ టీచింగ్ పోస్టులు
మండి (హిమాచల్‌ప్రదేశ్)లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ సూపరింటెండెంట్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.iitmandi.ac.in చూడొచ్చు.
 
ఎన్‌ఎస్‌ఐసీలో స్పెషల్ రిక్రూట్‌మెంట్
ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐసీ).. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో సిస్టం ఆపరేటర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 14. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 5. వివరాలకు www.nsic.co.in/careers.asp  చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement