మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు | jobs in kochi metro rail | Sakshi
Sakshi News home page

మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Published Thu, Oct 1 2015 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

కోచి మెట్రో రైల్ లిమిటెడ్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. మెయిన్‌టైనర్‌‌స-68, ట్రైనీ ఆపరేటర్/స్టేషన్ కంట్రోలర్‌‌స-80, జూని యర్ ఇంజనీర్‌‌స-22, సెక్షన్ ఇంజనీర్‌‌స-18. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 21. వివరాలకు http://kochimetro.org/career/ చూడొచ్చు.

ఈఎస్‌ఐసీ-న్యూఢిల్లీలో జూనియర్ ఇంజనీర్లు
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)-న్యూఢిల్లీ.. జూనియర్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. జూనియర్ ఇంజనీర్ (సివిల్-96, ఎలక్ట్రికల్-58). సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు అర్హులు. వయసు 30 ఏళ్లు మించరాదు. చివరి తేది నవంబర్ 10. వివరాలకు http://esic.nic.in/

సెంట్రల్ రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
సెంట్రల్ రైల్వే.. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డీజిల్ మెకానిక్-79, ఎలక్ట్రీషియన్-8, వెల్డర్(జీఅండ్‌ఈ)-5, మెషినిస్ట్-1, పెయింటర్(జనరల్)-1. పదో తరగతి, ఐటీఐలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వయసు 24 ఏళ్లు మించరాదు. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను ‘సీనియర్ డివిజినల్ మెకానికల్ ఇంజనీర్(డీజిల్), డీజిల్ షెడ్, ఘోర్‌పురి, పుణె-411001’కు పంపాలి. చివరి తేది అక్టోబర్ 8. వివరాలకు www.cr.indianrailways.gov.in చూడొచ్చు.

దీప్‌చంద్ బంధు హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్స్
ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న దీప్‌చంద్ బంధు హాస్పిటల్ అడ్‌హాక్ విధానంలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 7. సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మరిన్ని వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు.

సీజీసీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్
సీఎస్‌ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్(సీజీసీఆర్‌ఐ).. ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 7. నిర్దేశిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్/డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 28 ఏళ్లు మించకూడదు. అర్హులైనవారు అక్టోబర్ 8న కోల్‌కతాలో సీజీసీఆర్‌ఐ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వివరాలకు www.cgcri.res.in/

నిట్ - కర్ణాటకలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
కర్ణాటకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. వివిధ విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(బ్యాక్‌లాగ్)ల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎస్సీ-03, ఎస్టీ-10, ఓబీసీ-16). దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.nitk.ac.in చూడొచ్చు.

ఆర్‌జీఎన్‌ఐవైడీలో ప్రొఫెసర్లు
శ్రీపెరంబదూర్‌లోని రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ (ఆర్‌జీఎన్‌ఐవైడీ) ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. విభాగాలు.. ఎకనామిక్స్, జండర్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, ట్రైనింగ్. చివరి తేది అక్టోబర్ 21. మరిన్ని వివరాలకు  http://www.rgniyd.gov.in/node/1004 చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement