‘ఫార్మశీ’లో ఉపాధి అవకాశాలు పుష్కలం
ఎచ్చెర్ల: ఫార్మశీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్కలి డివిజన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎ.లావణ్య అన్నారు. చిలకపాలెం సమీపంలోని శివానీ ఇ ంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రపంచ ఫార్మశీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా బోధన ప్రయోగాత్మకంగా ఉండాలన్నారు.
పరిశోధనాత్మక విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విదేశాల్లో ఫార్మశిస్టులకు వైద్యులతో సమాన గుర్తింపు ఉందని, రోగానికి అవసరమైన మందులు సూచించేది ఫార్మశిస్టులేనని చెప్పారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి విభాగం అధికారులు షేకత్‌దత్, రమాకేపాల్, ఇంజినీరింగ్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.మురళీకృష్ణ, డాక్టర్ జీవీ రమేష్‌బాబు, ఫార్మశీ పిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, నరేంద్రకుమార్ పాల్గొన్నారు.