29న వికాసలో ఇంటర్వ్యూలు | On Feb 29th interviews in Vikasa | Sakshi
Sakshi News home page

29న వికాసలో ఇంటర్వ్యూలు

Published Sat, Feb 27 2016 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

On Feb 29th interviews in Vikasa

కాకినాడ సిటీ : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా 29న సుజలాస్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ (అనంతపురం)లో పనిచేసేందుకు ట్రెయినీ ఇంజనీర్, టెక్నీషియన్లు, హెల్పర్ ఉద్యోగాలకు ఇంటర్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస సంస్థ పీడీ విఎన్ రావు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఫెయిల్, ఐటీఐ, డిప్లమా చదివిన 28 ఏళ్లలోపు వయసు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులన్నారు. ఎంకైన ట్రెయినీ ఇంజనీర్ అభ్యర్థులకు రూ.12,185, టెక్నీషియన్లకు రూ.10,976,  హెల్పర్లకు రూ.7,671 జీతం ఇస్తారన్నారు. అసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో జరిగే ఇంటర్యూలకు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement