నల్లగొండ జిల్లా కోర్టులో వివిధ పోస్టులు | jobs in nalgonda district court | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లా కోర్టులో వివిధ పోస్టులు

Published Sun, Sep 13 2015 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

నల్లగొండ జిల్లా కోర్టులో వివిధ పోస్టులు

నల్లగొండ జిల్లా కోర్టులో వివిధ పోస్టులు

నల్లగొండ జిల్లా కోర్టు.. వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ఆఫీస్ సబార్డినేట్లు(ఖాళీలు-70), ప్రాసెస్ సర్వర్‌‌స (ఖాళీలు -06), కాపీస్టులు (ఖాళీలు-09), ఎగ్జామినర్‌‌స(ఖాళీలు-08), ఫీల్డ్ అసిస్టెంట్లు(ఖాళీలు-04), టైపిస్టులు(ఖాళీలు-13), స్టెనోగ్రాఫర్లు(ఖాళీలు-06), జూనియర్ అసిస్టెంట్లు(ఖాళీలు-20). పోస్టులను అనుసరించి వేర్వేరు అర్హతలు ఉంటాయి. దరఖాస్తులను ‘ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్‌‌జ, నల్లగొండ’కు పంపాలి. చివరి తేది సెప్టెంబర్ 28. వివరాలకు http://ecourts.gov.in చూడొచ్చు.

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటీస్ ట్రైనీలు
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ)- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (జీఏటీ) (ఖాళీలు-180), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టీఏటీ) (ఖాళీలు-210) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టీఏటీలు 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌లో డిప్లొమా, జీఏటీలు ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. శిక్షణలో స్టైఫండ్ చెల్లిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది అక్టోబర్ 10. వివరాలకు www.nlcindia.co.in చూడొచ్చు.

పుదుచ్చేరి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
పుదుచ్చేరి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. ఏఎన్‌ఎం/మెటర్నిటీ అసిస్టెంట్ -29, ఫైలేరియా ఇన్‌స్పెక్టర్-08, హెల్త్ అసిస్టెంట్-20, ఫార్మసిస్ట్ (అల్లోపతి)-15, రేడియోగ్రాఫర్-03, సీనియర్ లేబొరేటరీ టెక్నీషియన్-12, రిఫ్రిజిరేషన్ మెకానిక్-02, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ -05. ఎస్సెస్సీ, సంబంధిత సబ్జెక్ట్‌ల్లో డిప్లొమా/డి గ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తులు  ‘ద డైరక్టర్, డైరక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్, విక్టర్ సిమోనల్ స్ట్రీట్, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ బిల్డింగ్, పుదుచ్చేరి-605001’కు పంపాలి. చివరితేది సెప్టెంబర్ 25. వివరాలకు http://health.puducherry.gov.in చూడొచ్చు.

సీ-డాక్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు
సెంటర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ కంప్యూటింగ్ (సీ-డాక్)- మొహాలీ.. వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ల (ఖాళీలు-26) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీఈ/బీటెక్/ఎంసీఏ/ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 30. వివరాలకు http://cdac.in/index.aspx చూడొచ్చు.


ఆర్‌ఆర్‌సీ - ముంబైలో స్పోర్‌‌ట్స కోటా ఉద్యోగాలు
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)-ముంబై.. స్పోర్‌‌ట్స కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అంతర్జాతీయ/జాతీయ/రాష్ర్ట స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి, హెచ్‌ఎస్సీ/ఇంటర్మీడియెట్/డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తులను ‘సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఆర్‌టీ), సెంట్రల్ రైల్వే, చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌‌స ఆఫీస్, జనరల్ మేనేజర్ బిల్డింగ్, ఫస్ట్‌ఫ్లోర్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై-400001’కు పంపాలి. చివరి తేది సెప్టెంబర్ 30. వివరాలకు  www.rrccr.com చూడొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement