ఈ ప్రాంతం వారికే జాబ్ లాస్ రిస్క్ ఎక్కువ
ఈ ప్రాంతం వారికే జాబ్ లాస్ రిస్క్ ఎక్కువ
Published Thu, Jun 15 2017 5:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM
న్యూఢిల్లీ : ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలు ఇటీవల కాలంలో ఉద్యోగులుపై ఎడాపెడా వేటువేస్తూ తీవ్రభయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి వంకగా ఉద్యోగి పనితీరును పరిగణలోకి తీసుకుంటున్నాయి. అయితే ఉద్యోగాల కోతకు కంపెనీల ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగిపనితీరు మాత్రమే కాదంట. పనిచేసే ప్రాంతం కూడా కీలకమైనదిగా తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇండస్ట్రిలో ఉద్యోగులు పనిచేసే ప్రాంతం బట్టి కూడా వేటు పడుతుందని తెలిసింది. ఇతర టైర్ 1 సిటీలతో పోలిస్తే ఢిల్లీలో పనిచేసే వారికి జాబ్ లాస్ రిస్క్ ఎక్కువగా ఉందని టీమ్ లీజ్ సర్వే వెల్లడించింది. ఢిల్లీ తర్వాత జాబ్ ఎక్కువగా పోయే అవకాశం బెంగళూరు, హైదరాబాద్ లోనే ఉందట. పుణేలో తక్కువ జాబ్ లాస్ రిస్క్ ఉందని టైమ్ లీజ్ తెలిపింది.
ముంబై, అహ్మదాబాద్, చండీఘర్, చెన్నై, కోల్ కత్తా ప్రాంతాల్లో పరిస్థితి మధ్యస్థాయిగా ఉందని వెల్లడైంది. ఎకనామిక్టైమ్స్.కామ్ భాగస్వామ్యంతో టీమ్ లీజ్ దేశంలో ఉపాధి పరిస్థితిని రూపొందించింది. అంతేకాక ఉద్యోగాలు పోయే అవకాశాలు పరిశ్రమ, పరిశ్రమకు భిన్నంగా ఉన్నాయని, ఇండస్ట్రియల్ మానుఫ్రాక్ట్ర్చరింగ్, అలైడ్ సెక్టార్ లలో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా ఉంటుందని వివరించింది. వాటి తర్వాత కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బీపీఓ, ఐటీ సర్వీసుల్లో జాబ్ లాస్ రిస్క్ ఎక్కువగా ఉందని పేర్కొంది. టెలికాం, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేసే వారు ఉద్యోగాల కోతపై ఆందోళన చెందాల్సినవసరం లేదని చెప్పింది. ఈ రెండు రంగాలు జాబ్ లాస్ రిస్క్ ఇండెక్స్ దిగువస్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది.
Advertisement
Advertisement