న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) 1,800 మందికిపైగా ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రాంగణ నియామకాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించింది. 300లకుపైగా కళాశాలల నుంచి 36,000ల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించింది. 8,000 ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో కంపెనీ నిర్వహించింది. ఎల్‌అండ్‌టీ అనుబంధ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్, మైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేర్వేరుగా ఫ్రెషర్లను నియమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment