ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసీస్ గుడ్‌న్యూస్‌! | Infosys To Hire 45000 Freshers This Year FY 2022 | Sakshi
Sakshi News home page

ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసీస్ గుడ్‌న్యూస్‌!

Published Wed, Oct 13 2021 7:14 PM | Last Updated on Wed, Oct 13 2021 9:17 PM

Infosys To Hire 45000 Freshers This Year FY 2022 - Sakshi

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా నియామక ప్రక్రియ చేపట్టాయి. బెంగళూరు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సెప్టెంబర్ 30, 2021తో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ కోసం నియామక ప్రక్రియ చేపట్టింది. అంతే స్థాయిలో అట్రిషన్ స్థాయి(ఉద్యోగుల వలస రేటు) పెరిగింది. ఇంతకు ముందు లక్ష్యం 35,000తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకొనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

"మార్కెట్ పట్టు సాధించడం కోసం మేము మా కళాశాల గ్రాడ్యుయేట్ల నియామక ప్రక్రియ కింద 45,000కు నియమించుకొనున్నాం" అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు అన్నారు. జూన్ త్రైమాసికం చివరిలో ఇన్ఫోసీస్ 35,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. "డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడం, పరిశ్రమలో అట్రిషన్ రేటు పెరగడం వల్ల సవాళ్లు ఎదురు అవుతున్నాయి" అని సీఓఓ ప్రవీణ్ రావు ఇంతకు ముందు చెప్పారు. సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరిలో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల అట్రిషన్ రేటు గత ఏడాది 12.8%తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది 20.1% వద్ద ఉంది. సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి ఇన్ఫోసిస్‌లో 2,79,617 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.(చదవండి: ఎంత పనిచేశావు ఎలన్‌మస్క్‌..! నీ రాక..వారికి శాపమే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement