
ప్రముఖ దేశీయ దిగ్గజ సంస్థ రియలన్స్ ఇండస్ట్రీస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో మొత్తం 60వేల మంది ఉద్యోగుల్ని నియమిచుకోనున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ కంపెనీలతో జత కట్టిన నేపథ్యంలో భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
రియలన్స్ ఇండస్ట్రీస్ రీటైల్ విభాగంగా 200 సీనియర్ ఎగ్జిక్యూటీవ్‌లను ఎంపిక చేసుకోనుంది. వైస్ ప్రెసిడెంట్ లెవల్ పై స్థాయి ఉద్యోగులకు ఏడాదికి రూ.కోటి పైగా వేతనం చెల్లించనుంది. వీరితో పాటు వేలల్లో జూనియర్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లను, వచ్చే మూడు క్వార్టర్స్‌లో మొత్తం 60వేల మంది జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లను హయ‍్యర్ చేసుకుంటామని రిలయన్స్ వెల్లడించింది.
అంతర్జాతీయ కంపెనీలతో జత
రిలయన్స్ సంస్థ గ్లోబల్ బ్రాండ్‌లతో జత కట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొత్త అవుట్‌లెట్‌ను తెరిచింది. రానున్న నెలల్లో వాటిని పెంచేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో రిలయన్స్ రిటైల్ కోసం 150-200 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడంతోపాటు వైస్ ప్రెసిడెంట్, అంతకంటే పై స్థాయిలో ఉన్న వారిని నియమించుకోనుందని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని 6 నెలల పాటు ఒప్పందం మీద తాత్కాలిక సిబ్బంది నియమించుకోనుంది. అలా కాకుండా, కొత్త స్టోర్ల కోసం ఎక్స్‌పీరియన్స్, ఫ్రెషర్స్‌ను హయ్యర్ చేసుకోనుందని, జూనియర్ స్థాయిలలో నియమించుకోనున్న ఉద్యోగులకు వారి ప్రారంభ జీతం రూ.25,000- రూ.30,000 వరకు ఉండనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment