హైదరాబాద్ లో TSQS హైరింగ్ స్టార్ట్ | tsQs Recruited 15 Fresh Engineering Graduates Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో TSQS హైరింగ్ స్టార్ట్

Published Thu, Feb 9 2023 7:26 PM | Last Updated on Fri, Feb 10 2023 1:18 PM

tsQs Recruited 15 Fresh Engineering Graduates Hyderabad - Sakshi

హైదరాబాద్‌: తమ టాలెంట్‌ స్ట్రాటజీలో  భాగంగా మరియు యుఎస్‌లో వృద్ధి చెందుతున్న వ్యాపారానికి మద్దతు అందిస్తూ , డల్లాస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సేవల సంస్థ TSQS ఇంక్‌,  తమ హైదరాబాద్‌ ఆఫ్‌షోర్‌ కేంద్రంలో 15 మంది  ఫ్రెష్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించుకున్నట్లు వెల్లడించింది.

ఔత్సాహిక టెకీలతో కూడిన బృందం ప్రారంభించిన ఈ సంస్థకు అపూర్వమైన ఐటీ అనుభవం ఉంది. పలు ఇంప్లిమెంటేషన్స్‌పై, విభిన్నమైన డొమైన్స్‌లో  పనిచేస్తోన్న  టీఎస్‌క్యుఎస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లైఫ్‌ సైకిల్‌లో  క్వాలిటీ ఇంజినీరింగ్‌ ప్రాముఖ్యతను  గుర్తించింది. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ టూల్స్‌ను సైతం గుర్తించింది. ఇవి క్లయింట్స్‌ అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందించేందుకు సహాయపడతాయి అని TSQS ఇంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (క్వాలిటీ ఇంజినీరింగ్‌) శ్రీధర్‌ బొజ్జా అన్నారు.

‘‘టీఎస్‌క్యుఎస్‌ ఇంక్‌ పలువురు యువ ఇంజినీర్లను గుర్తించడంతో  పాటుగా వారికి అవసరమైన టూల్స్‌పై శిక్షణ అందించి, యుఎస్‌లోని  ప్రాజెక్టులలో నియమించింది. ఇప్పటికే చక్కటి ఫలితాలనూ పొందుతుంది.  ప్రస్తుత ద్రవ్యోల్భణం, క్లయింట్స్‌ బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుని, భారతదేశంలో కూడా అదే  తరహా టాలెంట్‌ వ్యూహం ప్రతిబింబించనున్నాము’’ అని  శ్రీధర్‌ అన్నారు.

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ బృందాలను నాణ్యమైన ఇంజినీరింగ్‌ బృందాలుగా  మార్చడం ద్వారా  సాఫ్ట్‌వేర్‌ డెలివరీ లైఫ్‌ సైకిల్‌  వ్యాప్తంగా తమ నైపుణ్యం మరియు సమస్యా పూరణ అనుభవాన్ని పొందుపరచాలనే లక్ష్యంతో ,  తగ్గించబడిన సమయం,  వ్యయాల వద్ద  టెస్టింగ్‌ల నకలు తొలగించడం, ఆటోమేషన్‌ వృద్ధి చేయడం, పునర్వినియోగం చేసేందుకు  సంస్థ యొక్క సామర్థ్యం పెంచుకోవాలని టీఎస్‌క్యుఎస్‌ ఇంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

‘‘ప్రస్తుత తమ ప్రాజెక్టులతో పాటుగా రాబోతున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే మాకు నాణ్యతకు భరోసా అందించే ఇంజినీర్ల అవసరం భారీగా ఉంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొనడంతో పాటుగా పక్క రాష్ట్రాల్లో కూడా మా ఆఫ్‌షోర్‌ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నాము. 2023లో  100కు పైగాఆఫ్‌షోర్‌ రిసోర్శెస్‌కు విస్తరించాలన్నది మా ఆలోచన. అలాగే 2024 క్యాలెండర్‌ సంవత్సరాంతానికి ఈ సంఖ్యను 250కు వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శ్రీధర్‌ అన్నారు

మార్కెట్‌ శోధన మరియు కన్సల్టింగ్‌ సంస్ధ  గ్లోబల్‌ మార్కెట్‌ ఇన్‌సైట్స్‌ (జీఎంఐ) ఉటంకించిన శ్రీధర్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ మార్కెట్‌ ప్రస్తుతం 40 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ గా ఉంది. ఇది 2030 నాటికి 70 బిలియన్‌ డాలర్లు చేరుకోవచ్చని అంచనా.  ఇది సీఏజీఆర్‌ 6%తో వృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా ఆటోమేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ప్రక్రియ కోసం డిమాండ్‌ పెరుగుతుండటం, నాణ్యత హామీ కోసం చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం దోహదపడుతున్నాయన్నారు.
చదవండి: చాట్‌జీపీటీకి అంత క్రేజ్‌ ఇందుకే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement