భారతదేశంలోని చాలా ఐటి కంపెనీలు కోవిడ్ కేర్ సదుపాయాలను తమ ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి. కరోనా సోకిన ఉద్యోగులకు 21 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. అలాగే, పూణే, బెంగళూరు నగరాలలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబల కోసం కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రాలుగా మార్చింది.
గ్రూప్ ఎంప్లాయి ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులందరికి కొవిడ్ సంబంధిత వైద్య చికిత్సలను కవర్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్, టెస్టింగ్ ల్యాబ్స్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల చికిత్స కోసం 242 నగరాల్లోని 1,490 ఆస్పత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. అలాగే, ఇన్ఫోసిస్ ప్రత్యేక బృందం వైద్య సిబ్బందితో కలిసి తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయడం వేగవంతం చేసింది. క్యాప్ జెమిని ఇండియా కోవిడ్ సోకిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కంపెనీ వైద్య భీమా కవరేజ్ వర్తింపచేస్తామని పేర్కొంది. ఇక మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో బెంగళూర్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో ఉద్యోగుల కోసం గత వారం వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment