హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
Published Tue, Nov 1 2016 9:51 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారమైనా లేదు. క్లింటన్ ఈ-మెయిల్స్ వ్యవహారం మాత్రం ముదురుతూ వస్తోంది. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడక వ్యవహారంలో ఇప్పటికే తలమునకలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. అమెరికా ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఫెడ్ డిబేట్లో అడగబోయే ప్రశ్నలు క్లింటన్కు ముందే తెలిశాయని వికిలీక్స్ పేర్కొంది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్పర్సన్, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డోనా బ్రజిలే ఫెడ్ డిబేట్ ప్రశ్నలను క్లింటన్కు ముందే అందిచారని వికీలీక్స్ తెలిపింది. వికీలీక్స్ పబ్లిష్ చేసిన క్లింటన్ ఈ-మెయిల్స్ బట్టి ఇది స్పష్టమైందని రిపోర్టు చేసింది. దీంతో ఫెడ్ డిబేట్ను నిర్వహించిన సీఎన్ఎన్ సంస్థ, డోనా బ్రజిలేతో పూర్తిగా తెగదెంపులకు సిద్దమైంది. న్యూస్ న్యూస్ నెట్వర్క్లో ఆమె చాలాకాలంగా కంట్రిబ్యూటర్గా నిర్వహిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 14న బ్రజిలే సమర్పించిన రాజీనామాను సీఎన్ఎన్ అంగీకరించిందని ఆ నెట్వర్క్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
డీఎన్సీ చైర్ డెబ్బీ వాసెర్మాన్ షుల్ట్ పదవికాలం ముగియడంతో, ఆ కమిటీ చైర్పర్సన్గా బ్రజిలే బాధ్యతలు స్వీకరించారు. జూలైలో సీఎన్ఎన్ కంట్రిబ్యూటర్గా ఆమె వైదొలిగారు. మార్చిలో ఫ్లింట్, మిచ్లో జరిగిన సీఎన్ఎన్ డెమొక్రాటిక్ డిబేట్ ప్రశ్నలను, ఆ తర్వాత కోలంబస్, ఓహియో సీఎన్ఎన్ టౌన్ హాల్లో జరిగిన డిబేట్ ప్రశ్నలను బ్రజిలే క్లింటన్కు ముందే లీక్ చేసినట్టు తాజా ఈ-మెయిల్ వ్యవహారంలో తెలిసింది. అయితే సీఎన్ఎన్ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. అసలు బ్రజిలేకు ముందస్తుంగా డిబేట్ ప్రశ్నలు తెలుసుకునే అవకాశం ఇవ్వలేదని తెలిపింది. మెటీరియల్ ప్రిపరేషన్ , బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, టౌన్హాల్ డిబేట్ మీటింగ్స్ ఇలా ఏ విషయాన్ని బ్రజిలేకు ఇవ్వలేదని సీఎన్ఎన్ అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపెయిన్ ఈవెంట్స్లో భాగంగా యాహు న్యూస్ లైవ్ కవరేజ్ కోసం మాత్రమే ఆమె ఈ డిబేట్కు అతిథిగా వచ్చారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై బ్రజిలే స్పందించడం లేదు.
Advertisement
Advertisement