ఎస్‌బీహెచ్ ప్రత్యేక | SBH launched new deposit scheme | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ ప్రత్యేక

Published Fri, Oct 4 2013 1:36 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

ఎస్‌బీహెచ్ ప్రత్యేక - Sakshi

ఎస్‌బీహెచ్ ప్రత్యేక

పండుగల సందర్భంగా అధిక వడ్డీతో కూడిన సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సందర్భంగా అధిక వడ్డీతో కూడిన సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రవేశపెట్టింది. వచ్చే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని 555 రోజుల కాలపరిమితి ఉండే విధంగా ‘ఎస్‌బీహెచ్ డీడీడీ’ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 5 వరకు అమలులో ఉండే ఈ పథకంపై 9.55 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ఎస్‌బీహెచ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అదే వృద్ధులకైతే 9.85% వడ్డీని ఇస్తోంది. డిపాజిట్ చేసిన ఏడు రోజుల తర్వాత ఎటువంటి పెనాల్టీలు లేకుండా వెనక్కి తీసుకునే అవకాశం ఉండటం ఈ పథకంలోని మరో  ఆకర్షణ. ప్రవాస భారతీయులు కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న ఈ డిపాజిట్ పథకంలో గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఎస్‌బీహెచ్ 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు డిపాజిట్ పథకాలపై 9% వడ్డీని ఆఫర్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement