దసరావళి సేల్స్ 50% పెరిగాయ్ | Big C Mobiles Launches Dasara & Diwali Festival Offers | Sakshi
Sakshi News home page

దసరావళి సేల్స్ 50% పెరిగాయ్

Published Sat, Oct 15 2016 12:41 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

దసరావళి సేల్స్ 50% పెరిగాయ్ - Sakshi

దసరావళి సేల్స్ 50% పెరిగాయ్

బిగ్ సి ఆఫర్లకు విశేష స్పందన
కంపెనీ సీఎండీ బాలు చౌదరి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దసరా, దీపావళి సందర్భంగా ప్రకటించిన దసరావళి సెలబ్రేషన్స్‌కు విశేష స్పందన లభిస్తోందని మొబైల్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ వెల్లడించింది. రూ.3 కోట్లకుపైగా విలువైన బహుమతులను కంపెనీ అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈ దసరా అమ్మకాల్లో 50 శాతం పైగా వృద్ధి నమోదైందని బిగ్ సి చైర్మన్ ఎం.బాలు చౌదరి తెలిపారు.

దసరావళికి కంపెనీ నిర్దేశించుకున్న వ్యాపార లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. తొలి వీక్లీ డ్రా తీసిన సందర్భంగా కంపెనీ డెరైక్టర్లు స్వప్నకుమార్, కృష్ణ పవన్, బాలాజి రెడ్డి, గౌతమ్ రెడ్డితో కలసి శుక్రవార మిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబరు 31 వరకు సాగే సెలబ్రేషన్స్‌లో ప్రతి వారం 100 మంది విజేతలను ఎంపిక చేస్తామన్నారు. వీరికి ఒక బ్రెజ్జా కారు, 7 ప్లాటినా బైక్‌లు, 22 ఎల్‌ఈడీ టీవీలు, 11 రిఫ్రిజిరేటర్లు, 11 వాషింగ్ మెషీన్లు, 37 ల్యాప్‌టాప్‌లు, 11 ఏసీలను కంపెనీ బహుమతిగా అందిస్తోంది.

దుబాయ్ చలోచలో..
దసరావళి ఆఫర్‌లో శాంసంగ్ ఎస్6 ఎడ్జ్ కొన్న ప్రతి కస్టమర్‌కు దుబాయ్‌కి రానూపోనూ టికెట్లను బిగ్ సి అందిస్తోంది. రూ.14,999 విలువగల మైక్రోమ్యాక్స్, వివో మొబైల్‌పై రూ.10,590 విలువైన ఎల్‌ఈడీ టీవీ ఫ్రీ. రూ.5,699 విలువగల లావా ఏ76పై రూ.2,590 విలువైన సింగర్ మిక్సర్ ఉచితం. రూ.9,999 విలువగల మైక్రోమ్యాక్స్ పల్స్ 4జీ మొబైల్ ఫోన్‌పై రూ.6,990 విలువైన ఎయిర్‌కూలర్, ఒప్పో ఎఫ్1ప్లస్ మొబైల్‌కు రూ.4,999ల విలువచేసే స్మార్ట్‌వాచ్, హెడ్‌సెట్, వీఆర్ గ్లాస్ ఫ్రీగా అందుకోవచ్చు. బంపర్ డ్రాలో అర కిలో బంగారం కూడా గెలవొచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.2,999లకే 1 జీబీ ర్యామ్‌తో ఇంటెక్స్ స్ట్రాంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 

నోట్-7 ప్రభావం లేదు..
టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ తయారు చేసిన నోట్-7 మోడల్‌లో సాంకేతిక సమస్యలు తలె త్తడం.. వాటిని కంపెనీ వెనక్కి తీసుకున్నసంగతి తెలిసిందే. నోట్-7 వివాదం నడుస్తున్నప్పటికీ శాంసంగ్ ఫోన్లకు డిమాండ్ తగ్గలేదని బాలు చౌదరి వెల్లడించారు. విపరీతంగా డిమాండ్ ఉండడంతో కొన్ని మోడళ్లకు కొరత ఏర్పడిందని చెప్పారు. నోట్-7 ప్రభావం మిగతా మోడళ్లపై ఏమాత్రం లేదని అన్నారు. కాగా, విజయనగరానికి చెందిన గోవింద్ అనే కస్టమర్ బ్రెజ్జా కారును గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement