దసరా, దీపావళికి ‘సంగీత’ మల్టీ బొనాంజ | Sangeetha Mobiles 2016 Festival Discount Offers | Sakshi
Sakshi News home page

దసరా, దీపావళికి ‘సంగీత’ మల్టీ బొనాంజ

Published Tue, Oct 4 2016 1:47 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

దసరా, దీపావళికి ‘సంగీత’ మల్టీ బొనాంజ - Sakshi

దసరా, దీపావళికి ‘సంగీత’ మల్టీ బొనాంజ

సాక్షి, బెంగళూరు: మొబైల్ రీటైల్ రంగంలోని సంగీత సంస్థ దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని వినియోగదారులకు పలు స్కీములను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ సుభాష్ చంద్ర ‘సాక్షి’ కి వివరించారు. ఆ విషయాలన్నీ ఆయన మాటల్లోనే... ‘ఏ కంపెనీకి చెందిన పాత ఫోన్ అయినా సంగీత మొబైల్ స్టోర్‌లో అందజేసి రూ.1,000 పొందవచ్చు. అలాగే ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై జియో సిమ్ ఉచితం. రూ.10 వేలు, అంత కంటే ఎక్కువ విలువ చేసే మొబైల్‌ను తొలివిడతగా రూ.99 చెల్లించి తీసుకోవొచ్చు. మిగిలిన మొత్తాన్ని ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ విధానంలో  చెల్లించవచ్చు.

ఇక సంగీత మొబైల్‌స్టోర్లో కొన్న ఏదేని మొబైల్ 30 రోజుల్లోపు కిందపడి డ్యామేజ్ అయితే...ఆ మొబైల్‌ను తిరిగి వెనక్కి ఇచ్చి కొత్తఫోన్‌ను సగం ధరకే కొనుక్కోవచ్చు. సంస్థ అమలు చేస్తున్న ప్రైస్ ప్రొటెక్షన్ స్కీం ప్రకారం సంగీతలో కొత్త ఫోన్ కొన్నప్పుడు 30 రోజుల్లో ఆ ఫోన్ ధర ఎంత తగ్గితే అందుకు సమానమైన మొత్తాన్ని వినియోగదారుడికి అందజేస్తాం. ఇలా ఎనిమిది నెలల కాలంలో ఇప్పటి వరకూ వివిధ వినియోగదారులకు రూ.3,10,30,791 చెల్లించాం. సంగీత గోబిబోతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై సంస్థ రూ.10 వేలు  విలుచేసే గోక్యాష్‌ను పొందవచ్చు.

ఈ గోక్యాష్ ద్వారా గోబిబోద్వారా ఫ్లైట్, బస్సుతో పాటు హోటల్ రూంలో బిల్లులో ప్రతి సారి 40% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈజీఫై యాప్ ద్వారా వినియోగదారుడి పాత ఫోన్‌కు సరైన ధర నిర్ణయిస్తారు. వీటితో పాటు సంగీత మొబైల్‌లో ప్రతి ఫోన్ కొనుగోలుపై అష్యూర్డ్ గిఫ్ట్‌ను వినియోగదారుడు అందుకోవచ్చు. లెదర్‌పర్స్, ఫిట్‌నెస్‌బాండ్, పవర్‌బ్యాంక్ వస్తువులను అష్యూర్డ్ గిఫ్ట్ అందుతుంది. సంగీత సంస్థకు చెందిన 300 స్టోర్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఐఫోన్-7ను సిటీబ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసి రూ. 10వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే. అక్టోబర్ 7న మార్కెట్‌లోకి రానున్న ఐఫోన్-7ను వినియోగదారులకు అందజేయడం కోసం ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ షోరూంలు తెరిచి ఉంటాయి.’ అని సుభాష్ చంద్ర వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement