జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో రెండో రోజు డెక్కన్ క్రానికల్ 61 పరుగుల ఆధిక్యం సాధించింది. ఎన్స్‌కాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ 345 పరుగులు చేసింది. సందీప్ (73), సందీప్ రాజన్ (60), షబీబ్ తుంబి (54) అర్ధ సెంచరీలతో రాణించారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ అజహరుద్దీన్ 3 వికెట్లు తీసుకున్నాడు. తొలి రోజు ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసిన ఎన్స్‌కాన్స్ జట్టు... అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 6 పరుగులు చేయడంతో డెక్కన్ క్రానికల్స్ జట్టు 61 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
మరో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఎస్‌బీహెచ్ జట్టుపై ఈఎంసీసీ జట్టు 133 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలరోజు ఇన్నింగ్స్‌లో ఈఎంసీసీ 343 పరుగులు చేయగా... రెండో రోజు ఇన్నింగ్స్‌లో ఎస్‌బీహెచ్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనూప్ పాయ్ (63), కుషాలి జిల్లా (68) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
డెక్కన్ క్రానికల్‌కు ఆధిక్యం
Published Fri, Oct 4 2013 12:22 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM
Advertisement
Advertisement