రవికిరణ్‌కు 4 వికెట్లు
ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్‌బీహెచ్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది. రవికిరణ్ (4/66), అబ్సొలెమ్ (3/32), అశ్విన్ యాదవ్ (2/23) ఆంధ్రాబ్యాంక్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 216/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లలో 251 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆంధ్రాబ్యాంక్ బౌలర్లు ఖాదర్, కనిష్క్‌నాయుడు చెరో 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్రాబ్యాంక్ జట్టులో ఒక్క రోనాల్డ్ రోడ్రిగ్వెజ్ (31) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఎస్‌బీహెచ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి జట్టుకు 85 పరుగుల ఆధిక్యాన్ని అందించారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 289 (నకుల్ వర్మ 142, పెంటారావు 76; రామకృష్ణ 4/61), ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 13/0 ఆర్.దయానంద్: 105/3 (నవీన్ కుమార్ 53; సుధాకర్ 2/28), దక్షిణ మధ్య రైల్వే జట్టుతో మ్యాచ్
ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 116, డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 276/9 (సి.వి. మిలింద్ 68, అక్షత్ రెడ్డి 60; చాంద్‌పాషా 6/99)
చైతన్యకృష్ణ సెంచరీ
ఈఎంసీసీతో జరుగుతున్న మ్యాచ్‌లో కాంటినెంటల్ బ్యాట్స్‌మన్ చైతన్యకృష్ణ (147 బంతుల్లో 125, 23 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో జట్టుకు 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈఎంసీసీ 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌటైంది.
వంశీవర్ధన్ వీరవిహారం
వంశీవర్ధన్ రెడ్డి (319 బంతుల్లో 163 బ్యాటింగ్, 22 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహన్ యాదవ్ (260 బంతుల్లో 101, 13 ఫోర్లు) శతకాలు సాధించడంతో హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 355 పరుగులు చేసింది. బీడీఎల్‌పై ఇప్పటికే 213 పరుగుల ఆధిక్యంలో నిలిచిన జట్టుకు ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. బీడీఎల్ తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే ఆలౌటైంది.
ఆంధ్రాబ్యాంక్ 166 ఆలౌట్
Published Thu, Jul 24 2014 12:08 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement