రాజధానికి బ్యాంకుల క్యూ
ఇప్పటికే పలు జాతీయ బ్యాంకుల ఏర్పాటు
పలు అంతర్జాతీయ బ్యాంకుల ఏర్పాటుకు అన్వేషణ
మంగళగిరి : రాజధాని నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న మంగళగిరిలో తమ శాఖలు ఏర్పాటుచేసేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు చర్యలు తీసుకుం టున్నాయి. ఆరు నెల ల క్రితం వరకు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్ మాత్రమే విని యోగదారులకు సేవలు అందించాయి. పట్టణంలో వినియోగదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఎస్‌బీఐ మెయిన్ బజార్ పక్కన శాఖ ఏర్పాటుచేసింది. తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో మరో ఆరు బ్యాంకులు తమ శాఖలను పట్టణంలో ఏర్పాటు చేయడం విశేషం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూని యన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, కరూరు వైశ్యా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు తమ కార్యాలయాలను ఏర్పాటుచేశాయి.
శాఖలు ఏర్పాటుతో పాటు పలు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ పథకాలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐసీఐసీఐ, ఐడీబీఐలతో పాటు మరిన్ని జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు తమ శాఖలను పట్టణంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే అవకాశం ఉండ టంతో ముందస్తుగానే బ్యాంకులు తమ శాఖలను ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి.