
ఎస్‌బీహెచ్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
పెబ్బేరు: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలకేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎంలో చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మెషిన్‌ను ధ్వంసం చేసి అందులో నగదును ఎత్తుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు. నగదు ఉన్న లాకర్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషిన్ పగలగొట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్‌ఐ రమేశ్, బ్యాంక్ మేనేజర్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.