ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు | State Bank of Travancore appoints new Chief GM | Sakshi
Sakshi News home page

ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు

Published Fri, Sep 2 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు

ఎస్బీహెచ్లో మరో ఇద్దరు జీఎంలకు బాధ్యతలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) కొత్తగా జనరల్ మేనేజర్లుగా నియమితులైన ఎం.ఎ. సమద్, రవీందర్ కుమార్ అగ్నిహోత్రి బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో రికవరీ అండ్ ప్లానింగ్ విభాగం జీఎంగా సమద్, విజయవాడ శాఖలో జీఎంగా (ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్) అగ్నిహోత్రి బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎస్‌బీహెచ్‌లో చేరిన సమద్.. బ్రాంచ్ మేనేజర్, డిప్యుటీ జీఎం, జీఎం తదితర హోదాల్లో పనిచేశారు. మరోవైపు, అగ్నిహోత్రి.. 1986లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానెర్ అండ్ జైపూర్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ తదితర హోదాల్లో పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement