
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్ చార్జి జనరల్ మేనేజర్ (జీఎం)గా నైరుతి రైల్వే జీఎం సంజీవ్ కిశోర్ శనివారం బా ధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు జీఎంగా పనిచేసిన గజానన్ మాల్యా శుక్రవారం పదవీ విరమణ పొందటంతో పూర్తిస్థాయి జీఎం నియామకం జరిగే వరకు సంజీవ్‌కిశోర్ అద నపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
రైల్వేలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. పలు దేశాల్లో శిక్షణ తీసుకున్నారు. రైల్వే ఉన్నతి, విదేశాలకు ఇక్కడి పరికరాల ఎగుమతిలో కీలకంగా వ్యవహరించటం, విదేశాలతో ఒప్పందాల్లో చురుగ్గా వ్యవహరించటం వంటి పలు సేవలకు సంజీవ్ 2003లో రైల్వే జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.