సాక్షి, హైదరాబాద్: మన్మాడ్–ముద్ఖేడ్–డోన్ రైల్వే మార్గంలోని కామారెడ్డి–మనోహరాబాద్ స్టేషన్ల మధ్య 67 కి.మీ. మేర విద్యుదీకరణను రైల్వే యంత్రాంగం పూర్తిచేసింది. మిషన్ విద్యుదీకరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు మార్గాల్లో పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర–దక్షిణ భారత ప్రాంతాలను జోడించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధి కీలకమైంది.
దీంతో ఈ జోన్ పరిధిలో ప్రణాళికాబద్ధంగా ఎలక్ట్రిఫికేషన్ పనులు నిర్వహిస్తున్నారు. మన్మాడ్–ముద్ఖేడ్–డోన్ మార్గంలో రూ.865 కోట్ల అంచనాతో 783 కి.మీ. మేర విద్యుదీకరించాలని 2015–16లో నిర్ణయించి, రైల్వే బోర్డు మంజూరు చేసింది. ఆ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment